Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

పొన్నాల రాజీనామాతో కంగుతున్న కాంగ్రెస్ … నిశ్శబ్దం పాటించండి శ్రేణులకు కాంగ్రెస్ ఆదేశం …

పొన్నాల రాజీనామాతో కంగుతున్న కాంగ్రెస్ … నిశ్శబ్దం పాటించండి శ్రేణులకు కాంగ్రెస్ ఆదేశం …
పొన్నాల లక్ష్మయ్యను బీసీల ట్రంప్ కార్డుగా ఉపయోగించుకోవాలని బీఆర్ యస్ యోచన
పొన్నాల పార్టీలోకి వస్తానంటే ఆయన్ను కలిసేందుకు సిద్ధమన్న కేటీఆర్
బీసీలకు పార్టీలో న్యాయం జరగడం లేదంటూ రాజీనామా చేసిన పొన్నాల
జనగామ టిక్కెట్‌ రాదనే అసంతృప్తితో రాజీనామా

మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై ఎవరూ స్పందించవద్దని పార్టీ అధిష్ఠానం నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. పొన్నాల రాజీనామాపై నేతలకు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన రాజీనామాపై ఏమాత్రం మాట్లాడవద్దని చెప్పింది. కాగా, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉండటమే కాకుండా, మంత్రిగా పని చేసిన పొన్నాల ఈ రోజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. జనగామ నియోజకవర్గం టిక్కెట్‌ తనకు రాదనే అసంతృప్తితో ఆయన పార్టీని వీడినట్లుగా చెబుతున్నారు. ఈ టిక్కెట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి కన్ఫర్మ్ అయిందంటున్నారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, సీనియర్లకు అపాయింటుమెంట్ ఇవ్వకుండా అవమానిస్తున్నారని పొన్నాల ఆరోపణలు గుప్పించారు. పొన్నాల రాజీనామా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ యస్ రంగంలోకి దిగింది…తమ పార్టీలోకి పొన్నాల వస్తానంటే ఆయన ఇంటికి వెళతానని మంత్రి కేటీఆర్ తెలిపారు . బీఆర్ యస్ కు చెందిన ఒక ఎంపీని పొన్నాలతో వెళ్లి మాట్లాడాలని ఆదేశించినట్లు సమాచారం …

పొన్నాలకు ప్రేమ పూర్వక ఆహ్వానం పలుకుతున్న బీఆర్ యస్ ..

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తమ పార్టీలో చేరుతామంటే సాదరంగా ఆహ్వానిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయనకు ప్రేమపూర్వక ఆహ్వానం పంపేందుకు బీఆర్ యస్ సిద్ధమైంది … బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ పొన్నాల నేడు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేటీఆర్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ పొన్నాల అంశంపై స్పందించారు. పొన్నాల తమ పార్టీలో చేరుతామంటే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తామన్నారు. త్వరలో చాలామంది ప్రముఖ నేతలు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారన్నారు.

అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో తన్నుకుంటారన్నారు. ఆ పార్టీ నుంచి తమ పార్టీలోకి వస్తారన్నారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం ఇద్దరు నేతల మధ్య అంగీకారం కుదిరినట్లుగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని లీడర్ అనడం కంటే రీడర్ అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ తల్లి ఆత్మగౌరవానికి, గుజరాత్ అహంకారానికి పోటీ జరుగుతోందన్నారు. తమపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసారి కూడా బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని, సింగిల్ డిపాజిట్‌కే పరిమితమవుతుందన్నారు. బీజేపీతో తమకు ఎలాంటి అవగాహన లేదన్నారు.

Related posts

రూ.1100 కోట్ల భూమిని రూ.3.41 కోట్లకే కేసీఆర్ దోచేశారు: వైఎస్ షర్మిల

Ram Narayana

ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ యస్ …అభ్యర్థులపై కుస్తీలు పడుతున్న కాంగ్రెస్ …!

Ram Narayana

కాంగ్రెసులోకి తుమ్మల వస్తే రెడ్ కార్పెట్ తో స్వాగతం …మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి….!

Ram Narayana

Leave a Comment