- భువనేశ్వరి, లోకేశ్‌తో పాటు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని ములాఖత్
- చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న కాసాని
- తెలంగాణలో టీడీపీ పోటీకి సంబంధించి సూచనలు తీసుకున్న కాసాని
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ మధ్యాహ్నం కలిశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌తో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ అధినేతతో ములాఖత్ అయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు వారి ములాఖత్ ముగిసింది.
ములాఖత్ అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఆయన మాట్లాడలేకపోతున్నట్లు చెప్పారు. జైల్లో ఆయన పరిస్థితి చూడగానే బాధ కలిగిందన్నారు.
కాగా, తెలంగాణలో టీడీపీ పోటీకి సంబంధించి అధినేత నుంచి కాసాని పలు సూచనలు తీసుకున్నట్టు తెలుస్తోంది.