Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

రాయల నాగేశ్వరరావు నివాసానికి పొంగులేటి …

రాయల నాగేశ్వరరావు నివాసానికి పొంగులేటి …!
పాలేరు టికెట్ గట్టిన ఆశించిన రాయల
నియోజకవర్గంలో నాలుగున్నర సంవత్సరాలుగా కార్యకర్తలను అంటిపెట్టుకున్న రాయల
పొంగులేటి ,తుమ్మల కాంగ్రెస్ లో చేరడంతో రాయల , జావేద్ ల ఆశల గల్లంతు
కొత్తగూడం పై ఆశలు పెట్టుకొని తిరిగిన పోట్ల …పొత్తుల భాగంగా సిపిఐకి కేటాయించడంతో మనస్తాపం
వారు పార్టీ మారుతున్నారని ప్రచారం …
ముగ్గురు నేతలు భట్టి అనుయాయులుగా గుర్తింపు
..

ఖమ్మం లో మంగళవారం మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి పాలేరు అసెంబ్లీ టికెట్ కన్ఫామ్ కావడంతో ఆపార్టీ నుంచి టికెట్ ఆశించిన రాయల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు …ఒక సందర్భంలో తనకు టికెట్ రాకపోవడంతో పార్టీ మారతారనే ప్రచారం జరిగింది..దీంతో ఆయన్ను కలిసి బుజ్జగించేందుకు పొంగులేటి రాయల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు …ఆయనతో భేటీ అయ్యారు …పాలేరు లో తనకు సహకరించాలని కోరారు …అయితే మీకు సహకరించేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ..నాకు పాలేరు లో వర్క్ చేసుకోమని చెప్పిన నేతల నుంచి సమాధానం కావాలని అదే సందర్భంలో నియోజకవర్గంలో తనను నమ్ముకున్న కార్యకర్తల అభిప్రాయాలూ కూడా తీసుకోని చెపుతానని అన్నారు .

ఖమ్మం టికెట్ ఆశించిన జావేద్ కూడా నియోజకవర్గంలో తనకంటూ సహచరులను ఏర్పరుచుకున్నారు …కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోని వెళ్లారు . తనకు సీటు గ్యారంటీ అనుకున్నారు . తీరా టికెట్స్ ఇచ్చే నాటికీ కాంగ్రెస్ లో చేరిన తుమ్మలకు కేటాయించారు …దీంతో జావేద్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు . పోట్ల నాగేశ్వరరావు కొత్తగూడెం టికెట్ ఆశించారు . ఆయన గత సంవత్సర కాలంగా అక్కడ ఇల్లు తీసుకోని మకాం వేసి సీటు తనకే వస్తుందని ఆశించారు . కానీ పొత్తులో భాగంగా ఆసీటు సిపిఐకి కేటాయించడంతో నిరాశగా ఉన్నారు ..

ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక పార్టీకి కత్తిమీద సాములా మారింది …మొదటి లిస్టులో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న సీఎల్పీనేత భట్టి విక్రమార్క మధిర నుంచి , భద్రాచలం నుంచి పొదెం వీరయ్యలను పేర్లు అధికారికంగా ప్రకటించారు . ఇక జిల్లాలోని మరో జనరల్ స్తానం కొత్తగూడెం సీటు సిపిఐకి కేటాయించారు . సిపిఐ నుంచి ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీచేయనున్నారు. పాలేరు నుంచి మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఖమ్మం నుంచి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు పోటిఖాయమైన వారి సీట్లు ఇంకా ప్రకటించలేదు …ఇక ఐదు ఎస్టీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది …అయితే ఇందులో కూడా పొంగులేటి తో కలిసి పార్టీలో చేరిన కోరం కనకయ్య (ఇల్లందు ) విజయాబాయి (వైరా ) కె .సుధాకర్ ( సత్తుపల్లి ) జారే ఆదినారాయణ (అశ్వారావుపేట ) పాయం వెంకటేశ్వర్లు (పినపాక ) ఉన్నారు . వారికోసం పొంగులేటి పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతుంది…అయితే పార్టీ మాత్రం నియోజకవర్గాలవారీగా చేసిన సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని చెప్పడంతో టిక్కెట్లు ఆశిస్తున్నా వారు కీంకర్తవ్యం అనే ఆలోచనలో పడ్డారు … వారిని ఏవిధంగా బుజ్జగించాలనే దానిలో నాయకత్వం మల్లగుల్లాలు పడుతుంది…చూద్దాం ఏమిజరుగుతుందో …. !

Related posts

ప్రచారంలో దుమ్ము రేపుతున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు…

Ram Narayana

పాలేరులో ఉమ్మడి అభ్యర్థి పొంగులేటిని గెలిపించండి ;సిపిఐ సమావేశంలో పోటు ప్రసాద్..

Ram Narayana

ఖమ్మం జిల్లాలో కలెక్టర్ విపి గౌతమ్ కొత్త ఆలోచన… శాశ్విత ప్రాతిపదికన పోలింగ్ స్టేషన్ల ఆధునికీకరణ..!

Ram Narayana

Leave a Comment