- కేబినెట్లో బీసీలకు జగన్ సముచిత స్థానం ఇవ్వలేదని టీడీపీ విమర్శలు
- బీసీలకు జగన్ కీలక బాధ్యతలను అప్పగించారన్న చెల్లుబోయిన
- 10 మంది బీసీలకు కీలక శాఖలను ఇచ్చారని వ్యాఖ్య
జగన్ కేబినెట్ లో బీసీలకు సముచిత స్థానం లేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మండిపడ్డారు. మంత్రివర్గంలో 10 మంది బీసీలకు జగన్ స్థానం కల్పించడమే కాకుండా… వారికి కీలకమైన శాఖలను అప్పగించారని కొనియాడారు. ఈ 10 మంది బీసీ మంత్రులు దశావతారాలు ఎత్తినట్టుగా… బీసీలను పట్టి పీడిస్తున్న సమస్యలను అంతం చేయడానికి పని చేస్తున్నారని చెప్పారు.
చెల్లుబోయిన చెప్పిన ఆ 10 మంత్రులు:
- ఉషశ్రీ చరణ్ – మహిళలు, శిశు సంక్షేమం కోసం పాటు పడుతున్నారు
- బొత్స సత్యనారాయణ – చిన్నారుల విద్యాబుద్ధులను చూసుకుంటున్నారు
- కారుమూరి నాగేశ్వరరావు – ఆకలి తీర్చే పౌరసరఫరాల మంత్రి
- సీదిరి అప్పలరాజు – పౌష్టికాహారం అందించే పాడి పశువుల పోషణ, సంరక్షణను చూసుకుంటున్నారు
- విడదల రజని – అనారోగ్యం బారిన పడిన వారిని ఆదుకునే ఆరోగ్య మంత్రి
- ధర్మాన ప్రసాదరావు – తినే ఆహారాన్ని, ఆర్థిక పంటలు పండించే భూ వ్యవహారాలను చూసుకుంటున్నారు
- జోగి రమేశ్ – చెట్ల నీడన, గుడిసెల్లో బతికే పేదలకు వసతి కల్పించే గృహ నిర్మాణ శాఖను చూసుకుంటున్నారు
- గుమ్మునూరు జయరాం – రెక్కల కష్టాన్ని నమ్ముకుని పనిచేసే వారికి అండగా కార్మికశాఖను చూసుకుంటున్నారు
- బూడి ముత్యాల నాయుడు – గ్రామాల అభివృద్ధికి పాల్పడే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను చూసుకుంటున్నారు
- బీసీ సంక్షేమ, సమాచార శాఖలను చూసుకుంటున్న తనది దశావతారమని చెల్లుబోయిన చెప్పారు.