మంత్రి పువ్వాడకు బిగ్ షాక్ …రఘునాథపాలెం ఎంపిపి కాంగ్రెస్ లో చేరిక…!
ప్రోటోకాల్ ఉందికాబట్టి స్టేజి మీద కూర్చోబెడుతున్నారు తప్ప అధికారం లేదని ఎంపిపి ఆవేదన
తుమ్మల గులుపుకోసం పనిచేస్తామని ప్రతిన
తమ చేరికతో ఎలాంటి వత్తిడి లేదని స్వచ్చందంగా చేరమని వెల్లడి ..
మాజీ సర్పంచ్ కూడా కాంగ్రెస్ లో చేరిక …
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి బిగ్ షాక్ తగిలింది… మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు (ఎంపిపి ) గౌరీ బీఆర్ యస్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ..శుక్రవారం ఉదయం ఖమ్మం పొంగులేటి క్యాంపు కార్యాలయానికి తన భర్త తో కలిసి వచ్చిన గౌరిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జి తుంబురు దయాకర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు ..వారి వెంట రఘనాథ పాలెం కు చెందిన సాదిక్ అలీ కూడా ఉన్నారు ..మాజీమంత్రి ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు . ఈ సందర్భంగా ఎంపీపీ గౌరీ మాట్లాడుతూ తన పేరుకే ఎంపీపీనని తనకు ఎలాంటి అధికారాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు . కేవలం ప్రోటోకాల్ ఉంది కాబట్టి అధికారిక కార్యక్రమాల్లో స్టేజ్ ఎక్కిస్తున్నారు తప్ప తమ అభిప్రాయాలకు ఎప్పుడు విలువలేదని అన్నారు . ఇలాంటి పదవి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటేనని ఉద్దేశంతో అత్యత భాదతో ,ఇప్పటివరకు తమ మనుషుల్లో ఉన్న భాదను తొలగించుకొని ఆత్మ అభిమానంతో బ్రతకాలని నిర్ణవించుకొని కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు ..తమ చేరిక ఎవవరి ప్రోద్బలం లేదని , స్వచ్చందంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు ..ఎంపీపీ గౌరీ వెంట ఆమె భర్త తో పాటు, సాదిక్ అలీ ఉన్నారు …ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులూ మువ్వా విజయ్ బాబు , సాధు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ..
ఖమ్మం అసెంబ్లీకి తిరిగి మూడవసారి పోటీచేస్తున్న పువ్వాడ అజయ్ హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహ రచన చేస్తున్న వేళ నిన్నటివరకు తన వెంట తిరిగిన అనేక మంది బీఆర్ యస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరడం అనూహ్యపరిణంగా ఉంది…ఇప్పటివరకు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఎలా ఉన్న, రఘనాథపాలెం మండలంలో మంత్రికి తిరుగులేదని అభిప్రాయాలు ఉన్నాయి. మరికొందరు పార్టీని విడనున్నారని సమాచారం ..