Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

 కాంగ్రెస్‌కు 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు… బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోతుంది: కేటీఆర్

  • ప్రచారంలో ముందున్నాం… ఫలితాల్లోనూ ముందుంటామన్న కేటీఆర్
  • తాము రెండు నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించామన్న మంత్రి
  • గతంలో వచ్చిన 88 స్థానాల కంటే అధిక స్థానాల్లో విజయం సాధిస్తామన్న కేటీఆర్

తాము ప్రచారంలో ముందున్నామని, అలాగే ఫలితాల్లోనూ ముందు ఉంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తాము అభ్యర్థులను ఎప్పుడో ప్రకటించామన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికి రెండు నెలలు అవుతోందన్నారు. బీ ఫారాలు అందించడం కూడా పూర్తయిందన్నారు. దీంతో ప్రచారంలో ముందున్నామని, తర్వాత ఫలితాల్లోను ముందే ఉంటామన్నారు.

గతంలో వచ్చిన 88 స్థానాల కంటే అధిక స్థానాల్లో తాము విజయం సాధిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి 40 నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరన్నారు. ఇక బీజేపీ అయితే యుద్ధానికి ముందే చేతులు ఎత్తేసిందని ఎద్దేవా చేశారు. బీజేపీ 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడం ఖాయమన్నారు.

Related posts

బండి సంజయ్ మాటల వెనక మర్మమేంటి …?

Ram Narayana

రైతుబంధు కావాలా? రాబందు కావాలా? అంటూ ముందే చెప్పామన్న కేటీఆర్

Ram Narayana

బిగ్ బ్రేకింగ్.. రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ

Ram Narayana

Leave a Comment