Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

రాయల ,జావేద్ ,పోట్ల లకు ఢిల్లీలో బుజ్జగింపులు …కేసి వేణుగోపాలతో భేటీ …

రాయల ,జావేద్ ,పోట్ల లకు ఢిల్లీలో బుజ్జగింపులు …కేసి వేణుగోపాలతో భేటీ …
తాము పార్టీ కోసం చేసిన కార్యక్రమాలను వివరించిన జావేద్, రాయల
ఒక్కరితో 30 నిమిషాలకు పైగా సమయం కేటాయించిన వేణుగోపాల్
తనకు పార్టీలో సముచిత స్తానం కావాలన్నా రాయల …తగిన గౌరవం ఇస్తామన్న వేణుగోపాల్
పార్టీ అధికారంలోకి రాగానే సముచిత స్తానం ఉంటుందన్న కేసి వేణుగోపాల్
రేవంత్ ,భట్టిని కలిసిన నేతలు….

కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం , పాలేరు ,కొత్తగూడెం సీట్లు ఆశించిన మహమ్మద్ జావేద్ , రాయల నాగేశ్వరరావు ,పోట్ల నాగేశ్వరరావు లు అధిష్టానం పిలుపు మేరకు ఆదివారం ఢిల్లీ వెళ్లారు .. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ను కలిశారు …వారితో కేసి వేణుగోపాల్ ఆయన నివాసంలో ఒక్కరితో మాట్లాడి పార్టీ వారికీ టికెట్స్ ఇవ్వలేకపోతుందో వివరించారు . పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండ మంచి అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు . పార్టీకి వారు చేసిన సేవలు గుర్తించినట్లు చెప్పారు .కొన్ని అనివార్య కారణాల వాళ్ళ టికెట్స్ ఇవ్వలేక పోతున్నామని తెలిపారు .మీసేవలు పార్టీకి ఎంతో అవసరమని అందువల్ల పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని కోరారు ..జావేద్ విద్యార్ధి దశ నుంచి ఎన్ ఎస్ యూ ఐ ,యూత్ కాంగ్రెస్ లలో కీలకంగా వ్యహరించిన విధానం పార్టీ నాయకత్వం గుర్తించిందని అందువల్ల తప్పకుండ మంచి భవిషత్ ఉంటుందని అన్నారు .

రాయల నాగేశ్వరరావు తో మాట్లాడుతూ పార్టీ కోసం ఆయన చేసిన కృషిని మెచ్చుకుంటూనే టికెట్ ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తున్నామని పార్టీ అవసరాలు , అర్థం చేసుకొని సహకరించాలని కోరారు . రాయల పార్టీలో తనకు మంచి పొజిషన్ ఇవ్వాలని కోరారు. త్వరలో రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు …పోట్ల నాగేశ్వరరావు సీటు ఇంకా ఫైనల్ కాలేదని అందువల్ల మీరు కొంచెం అగండని అన్నారు.

కమ్యూనిస్టుల సీట్ల విషయంలో కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని తెలుస్తుంది.. వారు అడిగే సీట్లలో చెరొక రెండు ఇవ్వడానికి సిద్దమైన కాంగ్రెస్ వారు పట్టుబట్టే సీట్లు ఇచ్చేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం …సిపిఐ విషయంలో క్లారిటీ వచ్చినప్పటికీ , సిపిఎం విషయంలో చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు …

Related posts

కిషన్ రెడ్డి మూసీ నిద్ర ఫొటోషూట్ కోసమే: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Ram Narayana

అన్యాయం జరిగింది.. కానీ పార్టీ కోసం ఉపసంహరించుకున్నా: పటేల్ రమేశ్ రెడ్డి కంటతడి

Ram Narayana

మిత్ర ధర్మాన్ని పాట్టిదాం…ఉమ్మడి అభ్యర్థులను గెలిపిద్దాం…

Ram Narayana

Leave a Comment