- ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు బహిరంగ లేఖ
- ములాఖత్ సందర్భంగా బాబు చెప్పిన అంశాలతో లేఖ విడుదల చేసిన కుటుంబసభ్యులు
- ఆ లేఖతో తమకు సంబంధం లేదన్న రాజమహేంద్రవరం అధికారులు
- ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల
తెలుగు ప్రజలను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో చెప్పిన విషయాలతో ఆయన కుటుంబసభ్యులు బాబు పేరిట ఓ బహిరంగ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ లేఖతో తమకు ఎటువంటి సంబంధం లేదని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్ ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు సంతకంతో కరపత్రం జైలు నుంచి విడుదల కాలేదని స్పష్టం చేశారు. ఈ లేఖతో జైలుకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు. జైలు నిబంధనల ప్రకారం, ఖైదీలు విడుదల చేయదలిచిన లేఖలను ముందుగా జైలు అధికారులు పూర్తిగా పరిశీలించి దాన్ని జైలర్ ధ్రువీకరించి సంతకం, కారాగార ముద్రతో సంబంధిత కోర్టులకు లేక ఇతర ప్రభుత్వ శాఖలకు పంపుతారని చెప్పారు. కాబట్టి, ఇవేవీ లేని చంద్రబాబు లేఖతో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.