- 50,000 మెజార్టీతో తాను తప్పకుండా గెలుస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా
- కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం ఉంటుందని హామీ
- అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టీకరణ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు! వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్న తనకు 50,000 మెజార్టీ ఖాయమని, అంతకు ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు సాగి, పార్టీని అధికారంలోకి తీసుకు వస్తామన్నారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.