Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ సీఎం

రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ సీఎం
తన కుమార్తె ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో షొలాపూర్ నుంచి పోటీ
రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకున్న కాంగ్రెస్ కు అవసరమైన సేవలు చేస్తానన్న షిండే


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు.

తన రాజకీయ వారసురాలిగా తన కుమార్తె ప్రణీతి పేరును ఆయన ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోలాపూర్ నియోజకవర్గం నుంచి తన కుమార్తె పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు.

దిగువ కోర్టులో న్యాయాధికారిగా, ముంబై పోలీసు శాఖలో నిఘా అధికారిగా పనిచేసి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సుశీల్ కుమార్ 6 ధశాబ్దాలపాటు రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించారు.

మహారాష్ట్రతోపాటు కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులను ఆయన నిర్వర్తించారు. దళిత కుటుంబానికి చెందిన 82 ఏళ్ల షిండే డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంలో విద్యుత్ శాఖను ఆ తర్వాత హోం శాఖను నిర్వహించారు.అంతకుముందు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

షిండే కుమార్తె ప్రణీతి షిండే(42) సోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గానికి దవ దఫా శాసనసభ్యురాలిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె సోలాపూర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారు.

తాను ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శనం వహిస్తానని ఆయన చెప్పారు. 2024లో మహారాష్ట్రలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి..

Related posts

రాజకీయంగా పోరాడడం చేతకాని వారే దర్యాప్తు సంస్థలను ఆశ్రయిస్తారు.. అభిషేక్ బెనర్జీ ఫైర్

Ram Narayana

ఎన్డీయే కూటమి నాయకుడిగా మోదీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నాం: చంద్రబాబు

Ram Narayana

రాయ్‌బరేలి నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ…

Ram Narayana

Leave a Comment