Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కారును ఆపి..,డాక్ట‌ర్ దంప‌తుల్ని కాల్చి చంపేశారు…

కారును ఆపి..,డాక్ట‌ర్ దంప‌తుల్ని కాల్చి చంపేశారు….

రాజ‌స్థాన్‌లో దారుణం జ‌రిగింది. కారులో వెళ్తున్న డాక్ట‌ర్ దంప‌తుల‌పై ఇద్ద‌రు కాల్పులు జ‌రిపారు. ఆ ఘ‌ట‌న‌లో డాక్ట‌ర్‌తో పాటు ఆయ‌న భార్య మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న భ‌ర‌త్‌పూర్‌లో జ‌రిగింది. న‌గ‌రంలోని బిజీ క్రాసింగ్ వ‌ద్ద ఈ కాల్పుల ఘ‌ట‌న జ‌ర‌గ‌డం శోచ‌నీయం. సాయంత్రం 4.45 నిమిషాల‌కు సంఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. క్రాసింగ్ వ‌ద్ద బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులు.. కారుకు అడ్డంగా నిలిచారు. అయితే డ్రైవ‌ర్ సీటులో ఉన్న డాక్ట‌ర్‌.. కారు విండో తీస్తుండ‌గానే.. బైక్‌పై వ‌చ్చిన ఓ వ్య‌క్తి త‌న చేతిలో ఉన్న పిస్తోల్‌తో కాల్పులు జ‌రిపాడు. ప‌లు రౌండ్లు కాల్పులు జ‌రిపి.. బైక్‌పై ప‌రారీ అయ్యారు. ప్ర‌తీకారంతోనే ఆ డాక్ట‌ర్ దంపతుల‌ను హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ యువ‌తి హ‌త్య కేసులో డాక్ట‌ర్ దంప‌తులు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. డాక్ట‌ర్‌తో రిలేష‌న్‌పిప్‌లో ఉన్న ఆ యువ‌తిని హ‌త్య చేశారు. డాక్ట‌ర్‌పై కాల్పులు జ‌రిపిన వ్య‌క్తి ఆ యువ‌తి సోద‌రుడిలా ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. రెండేళ్ల క్రితం ఆ యువ‌తి హ‌త్య‌కు గురైంది. ఈ కేసులో డాక్ట‌ర్ భార్య‌తో పాటు ఆమె త‌ల్లి కూడా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

Related posts

తుపాకీతో బెదిరించి క్షణాల వ్య‌వ‌ధిలో చైన్‌లాక్కెళ్లిన యువ‌కులు..

Drukpadam

హైదరాబాద్ ఇన్‌కం ట్యాక్స్ కార్యాలయానికి బాంబు బెదిరింపు కాల్…!

Drukpadam

లండన్‌లో అర్ధరాత్రి భారత సంతతి మహిళ హత్య…

Ram Narayana

Leave a Comment