Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోర్ట్ తీర్పులు

చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తి… రేపు తీర్పు

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ
  • ముగిసిన వాదనలు… తీర్పు రిజర్వ్ లో ఉంచిన న్యాయమూర్తి

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ లో ఉంచింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును రేపు (అక్టోబరు 31) వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అంతేకాకుండా, చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ఎప్పుడనేది రేపు నిర్ణయిస్తామని చెప్పారు. చంద్రబాబు తరఫున న్యాయవాదులు మధ్యాహ్నం వరకు వాదనలు వినిపించగా, మధ్యాహ్నం తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయి గత 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ విషయంలో వాదనలు , క్వాష్ పిటిషన్ పై వాదనలు , తాత్కాలిక బెయిల్ పై సోమవారం జరిగిన వాదనలు డైలీ సీరియల్ కథనాలు తలపిస్తున్నాయి…చంద్రబాబుకు జైల్లో సరైన సౌకర్యలు లేవని ,బరువు తగ్గారని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ,కంటి ఆపరేషన్ అవసరం ఉందని పలుమార్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు …చివరకు చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందని ,ఆయన ఉన్న బ్యారక్ లో గంజాయి ప్యాకెట్లు విసిరారని ,డ్రోన్ కెమెరా ఎగిరిందని, ఆయన ఆరోగ్య పరీక్షల రిపోర్ట్ సరిగా వెల్లడించడంలేదని అభియోగాలు ఉన్నాయి.. మావోయిస్టుల బెదిరింపు లేఖ రాసారని చేసిన ప్రసారాలను జైలు అధికారులు ఖండించారు .. ఈనేపథ్యంలో బెయిల్ కోసం చంద్రబాబు తరుపున లాయర్లు సుప్రీం కోర్ట్ నుంచి హైకోర్టు సి,ఐ డి కోర్టుల వరకు ఎక్కని మెట్టు దిగని మెట్టులేదు …

Related posts

‘పతంజలి’పై కోర్టు మరోమారు ఆగ్రహం.. క్షమాపణ ప్రకటన సైజుపై ఆరా…

Ram Narayana

తనపై అనర్హతను తిరిగి విచారించాలని హైకోర్టు లో వనమా పిటిషన్ …స్వీకరించిన న్యాయస్థానం

Ram Narayana

చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్

Ram Narayana

Leave a Comment