Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్‌ను గద్దె దింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌లో చేరాను: వివేక్

  • వివేక్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడుకు వంశీ
  • టిక్కెట్ కేటాయింపు తనకు అంత ముఖ్య విషయం కాదన్న వివేక్
  • వివేక్ చేరికతో పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్న రేవంత్ రెడ్డి

మాజీ ఎంపీ వివేక్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. వివేక్‌తో పాటు ఆయన తనయుడు వంశీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందన్నారు.

కేసీఆర్ కుటుంబం వారి ఆకాంక్షల మేరకే పని చేస్తోందన్నారు. కేసీఆర్‍‌ను గద్దె దింపాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. టిక్కెట్ కేటాయింపు తనకు అంత ముఖ్యమైన విషయం కాదని, బీఆర్ఎస్‌ను గద్దె దించడమే ముఖ్యమన్నారు. 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్‌ను గద్దె దింపే శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని వివేక్ నమ్మారని చెప్పారు. ఆయన చేరికతో పార్టీకి వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Related posts

అచ్చంపేటలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు అస్వస్థత

Ram Narayana

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీఆర్ యస్ చేరిక పై బీఆర్ యస్ లో అసమ్మతి …!

Ram Narayana

అల్లుడిపైనే కాదు… అవసరమైతే కొడుకుపైనా పోటీ చేస్తా: కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ

Ram Narayana

Leave a Comment