- బుధవారం జూబ్లిహిల్స్ లోని ఇంటికి చేరుకున్న ఏపీ మాజీ సీఎం
- సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యుల బృందం
- డాక్టర్ల సూచనతో గురువారం ఉదయం ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురువారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ చేరుకున్న చంద్రబాబును వైద్యుల బృందం పరీక్షించింది. అనంతరం గురువారం ఆసుపత్రికి రావాలని సూచించింది.
ఉదయం ఆసుపత్రికి వచ్చిన చంద్రబాబుకు ఏఐజీ వైద్యుల బృందం వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వైద్య పరీక్షలు పూర్తయ్యాక చంద్రబాబు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ నేత్ర పరీక్షలు చేయించుకుంటారని వివరించాయి.