- ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డిలకే టిక్కెట్
- చేవెళ్ల నుంచి కేఎస్ రత్నం, అంబర్ పేట నుంచి కృష్ణయాదవ్
- సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి
తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ గురువారం మధ్యాహ్నం విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. 45 మంది అభ్యర్థులతో నిన్ననే విడుదల చేస్తారని భావించారు. కానీ టిక్కెట్ కోసం ఒక్కో నియోజకవర్గం నుంచి ఒకరికి మించి ఆసక్తి చూపించడం, జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటు నేపథ్యంలో ఆలస్యమైంది. ఈ రోజు 35 మందితో మూడో జాబితాను విడుదల చేసింది.
మొదటి జాబితాలో తన పేరు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బాబుమోహన్ పేరు మూడో జాబితాలో వచ్చింది. గతంలో పోటీ చేసిన ఆందోల్ టిక్కెట్ కేటాయించింది. ఈ జాబితాలోనూ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. బాన్సువాడ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఆందోల్ నుంచి బాబుమోహన్, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డి, అంబర్ పేట నుంచి కృష్ణయాదవ్, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, అచ్చంపేట నుంచి దేవని సతీష్ మాదిగ, వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి తదితరులకు టిక్కెట్ వచ్చింది.