Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

సీఎం కేసీఆర్ సభలకు ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాపిత స్పందన…మంత్రి అజయ్ !

సీఎం కేసీఆర్ సభలకు ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాపిత స్పందన…మంత్రి అజయ్ !
కేసీఆర్ ప్రసంగాలకు ప్రజలనుంచి మంచి స్పందన
పథకాలపై ప్రజల అభిప్రాయాలు అడుగుతున్న తీరు ఆకట్టుకుంటుంది..
మళ్ళీ సీఎంగా కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు .
ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లు గెలుస్తాం
ఖమ్మంను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దే
ఈనెల 5 ఖమ్మంలో జరిగే ప్రజా ఆశీర్వాదసభను జయప్రదం చేయండి …

సీఎం కేసీఆర్ సభలకు జనం పోటెత్తేటం చూస్తేంటే ప్రజల గుండెల్లో ఆయన కు ఎలాంటి స్తానం ఉందొ అర్థం అవుతుందని బీఆర్ యస్ ఖమ్మం అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు . ఇది ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా ఉందన్నారు ..కేసీఆర్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి , అమలు చేసుతున్న సంక్షేమ పథకాలు అలాంటివి అని అన్నారు . స్వత్రంత్ర భారత దేశంలో ఎవరికిరాని ఆలోచనలు కేసీఆర్ చేశారని రైతులకు 24 గంటల విద్యుత్ , రైతు బంధు , దళిత బంధు రైతులకు బీమా ,బీసీ బందు , కల్యాణ లక్ష్మి , షాదిముబారక్ ఆసరా లాంటి పెన్షన్లు దేశంలో అములు జరుపుతున్న ఏకైన రాష్ట్ర తెలంగాణ అని అందువల్ల కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాలని పథకాలు కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నందునే ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని అన్నారు . సభలలో కేసీఆర్ అమలు జరుగుతున్న పథకాలు ఉండాలి వద్దా ..? అని ప్రజల అడుగుతున్న తీరు ఆకట్టుకుంటుందని అజయ్ అన్నారు .

3 వేల కోట్లతో ఖమ్మం నియోజకవర్గం అభివృద్ధి …

ఖమ్మం నియోజకవర్గ చరిత్రలో 3 వేల కోట్ల నిధులతో కానీ విని అభివృద్ధి జరిగిందని మంత్రి అజయ్ అన్నారు. ఇది కేసీఆర్ వల్లనే సాధ్యమైందని కేసీఆర్ కు కచ్చితంగా ఖమ్మం ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు . గత ఖమ్మానికి ,ప్రస్తుత ఖమ్మానికి పోల్చి చుస్తే అర్థం అవుతుందని అన్నారు . ఖమ్మం ఇంతగా అభివృద్ధి చేసుందుతుందని ఎవరైనా ఊహించారా ..? భూములకు కోట్ల రూపాయల రేట్లు పలుకుతామని అనుకున్నారా …కేసీఆర్ విజన్ తో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు …ఖమ్మంలో తాను మొదటసారి పోటీచేసినప్పుడు 70 మాత్రమే అపార్టుమెంట్లు ఉండగా నేడు 700 ఉన్నాయని అన్నారు . ఖమ్మంలో అన్ని రకాల షాపింగ్ మహల్స్ వచ్చాయని ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు .

ఖమ్మం లో ఇప్పటివరకు మూడు సభలు జరిగాయని అన్నిటికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని సీఎం సైతం ఆశ్చర్య పోయారని జిల్లాలో 10 కి 10 సీట్లు బీఆర్ యస్ ను గెలిపించి ఉమ్మడి జిల్లాను మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు ..

5 వ తేదీన ఖమ్మం , కొత్తగూడెం లలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

ఈనెల 5 వ తేదీన ఆదివారం ఖమ్మం ,కొత్తగూడెం లలో జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని అజయ్ పిలుపునిచ్చారు . మొదట కొత్తగూడెంలో సభ ఉంటుందని తర్వాత ఖమ్మంలో సాయంత్రం 3 గంటలకు ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాల మైదానంలో సభ జరుగుతుందని అన్నారు .సభకు ఎంపీ నామ నాగేశ్వరరావు ఇంచార్జి గా ఉన్నారని ,జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధు సైతం మూడు రోజులు ఖమ్మంలోని ఉంది ఖమ్మం సభ జయప్రదం కోసం కృషి చేస్తారని అన్నారు ..సభకు ఉమ్మడి జిల్లాలోని అందరు అభ్యర్థులను ఆహ్వానిస్తున్నామని అన్నారు ..

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ….

నిన్న జరిగిన సత్తుపల్లి, ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం అయ్యాయి.
5వ తేదీన జయప్రదం చేయాలనీ కోరారు ..ఖమ్మం నియోజకవర్గం నుండి సుమారు లక్ష మంది వచ్చి సభను విజయవంతం చేయాలన్నారు ..ఇల్లందులో గతంలో చిన్న చిన్న సభలు జరిగి ఉంటాయి కానీ అతి పెద్ద సభ జరిగి, విజయవంతం అవ్వడం ఇదే ప్రథమం సభకు వచ్చిన వారికీ సభాప్రధానికి సహకరించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు ..

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ …


సత్తుపల్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు…. దేవుడి దయ వల్ల సభకు సంబందించి ఏ ఒక్క ఘటన జరగకపోవడం అదృష్టం…నిన్న సభతో సత్తుపల్లి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది….ఆ ఉత్సాహంతో ఎన్నికల్లో గెలుపొంది తీరుతామని విశ్వాసం వ్యక్తం చేశారు ..హైదరాబాద్ తర్వాత అంతలా అభివృద్ధి జరిగిన ప్రాంతం ఖమ్మం నగరం మాత్రమే…ఖమ్మం నగర అభివృద్ధిలో మంత్రి పువ్వాడ అజయ్ కృషి ఎనలేనిది….కొంతమంది నాయకులు బీ ఆర్ ఎస్ పార్టీలో ఉంటే అప్పుడు 10 కి 10 స్థానాలు ఎందుకు గెలవలేదు….వీళ్ళు ఎవ్వరూ కాంగ్రెస్ పార్టీలో లేని సమయంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు 9 స్థానాలు వచ్చాయి….సీఎం కెసిఆర్ ఖమ్మం జిల్లాకు ఏ అన్యాయం చేయలేదు. కేవలం ఒక్క సీట్ ఇచ్చినా అభివృద్ధిలో మాత్రం ఖమ్మం ను అభివృద్ధిపథంలో ముందుంచారు….సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయ్యింది….సీఎం కెసిఆర్ సహకారంతో సత్తుపల్లిలో ఒక్క మట్టి రోడ్ లేదు అంటే అతిశయోక్తి కాదు…గ్రామాల్లో 80 శాతం సిమెంట్ రోడ్లు నిర్మించాం….సభా ప్రాంగణాలు ప్రజల్లో ఇంత ఉత్సాహంతో జరుగుతున్నాయి అంటే అర్ధం బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందినట్లే అన్నారు ..

ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ ..

5వ తేదీన ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్, కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలను జయప్రదం చేయాలనీ అన్నారు ..సీఎం కెసిఆర్ ఇప్పటి వరకు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు అన్ని విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు …

Related posts

వరాలిచ్చేందుకే తెలంగాణకు సోనియమ్మ… పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ram Narayana

పార్టీకి చెడ్డపేరు తేకండి …పువ్వాడ నాగేశ్వరావు కు సిపిఐ జాతీయకార్యదర్శి నారాయణ లేఖ!

Ram Narayana

బీజేపీ తీర్థం పుచ్చుకున్న చికోటి ప్రవీణ్

Ram Narayana

Leave a Comment