Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కామ్రేడ్స్ కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ …17 స్థానాలకు పోటీచేస్తామని సిపిఎం ప్రకటన…

కామ్రేడ్స్ కు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ …17 స్థానాలకు పోటీచేస్తామని సిపిఎం ప్రకటన
కాంగ్రెస్ వైఖరిపై సిపిఎం గరం గరం …
ఒకే సీటు కేటాయిస్తే సీపీఐ కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై?
రేపు కూనంనేని అధ్యక్షతన సీపీఐ కార్యవర్గం భేటీ
పొత్తు కుదరకుంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై చర్చ
చెన్నూరు, కొత్తగూడెం కోరుతున్న సీపీఐ
కొత్తగూడం సీపీఐ లో అనూహ్యపరిణామాలు
అవి తమ అంతర్గత సమస్యలు అన్న షాబీర్ పాషా
చర్చించి పరిష్కరించుకుంటామని వెల్లడి ..

కామ్రేడ్స్ కు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది..కాంగ్రెస్ వైఖరిపై కామ్రేడ్స్ గరంగరంగా ఉన్నారు .నిన్నమొన్నటివరకు వారు కోరిన చేరు ఐదు కాకుండా చెరో రెండు సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డ కాంగ్రెస్ ఎందుకో అయికూడా ఇచ్చేందుకు సుముఖత చూపకపోవడంతో వారిమధ్య గత నెలరోజులకు పైగా జరుగుతున్న పొత్తుల చర్చలకు ఫులిస్టాప్ పడింది…దీంతో సిపిఎం ముందుగా ప్రకటించగా విధంగా గురువారం సాయంత్రంవరకు కాంగ్రెస్ నుంచి ఏమైనా సానుకూల సంకేతాలు వస్తాయనే ఎదురు చూసింది..ఇక అటునుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో సిపిఎం తమకున్న బలం అవకాశాలు బట్టి 17 సీట్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది . ఈ మేరకు ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇప్పటివరకు జరిగిన పరిణామాలు తమ పార్టీ వైఖరిని వెల్లడిస్తూ పార్టీ నిర్ణయం మేరకు పోటీచేస్తున్న నియోజకవర్గాల పేర్లను హైద్రాబాద్ లో ఏర్పాటు చేసినా మీడియా సమావేశంలో వెల్లడించారు .

వాటిలో …..
1 .భద్రాచలం
2 .అశ్వారావుపేట
3 .పాలేరు
4 .మధిర
5 .వైరా
6 .ఖమ్మం
7 .సత్తుపల్లి
8 .మిర్యాలగూడెం
9 .నల్గొండ
10 .నకిరేకల్
11 .భవనగిరి
12 .హుజూర్ నగర్
13 .కోదాడ
14 .జనగాం
15 .ఇబ్రహీంపట్నం
16 .పటాన్ చెరువు
17 .ముషీరాబాద్

నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే సిపిఐ తోకలిసి పోటీచేస్తే కొన్ని నోయోజకవర్గాలు మారె అవకాశం ఉందని మీడియా సమావేశంలో తమ్మినేని తెలిపారు. సిపిఐ తన నిర్ణయాన్ని శక్రవారం వారి రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం వెల్లడిస్తామని తెలిపిందని అన్నారు . అదే సందర్భంలో తాము పోటీచేయని నియోజకవర్గాల్లో బీజేపీని ఓడించే శక్తులకు ఓట్లు వేస్తామని తెలిపారు . అది కాంగ్రెస్ కావచ్చు ,లేదా బీఆర్ యస్ కావచ్చునని తమ్మినేని వివరించారు ..

అదే బాటలో సిపిఐ …

కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఇప్పటికే సీపీఎం గుడ్‌బై చెప్పింది. సీపీఐ రేపు నిర్ణయించనుంది. రేపు సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన కార్యవర్గం భేటీ కానుంది. కాంగ్రెస్‌తో పొత్తు విషయమై ఇంకా స్పష్టత రాని క్రమంలో ఏం చేయాలనేది రేపు చర్చించనున్నారు. పొత్తు కుదరకుంటే ఎన్ని సీట్లలో పోటీ చేయాలో నిర్ణయించనున్నారు. చెన్నూరు, కొత్తగూడెం టిక్కెట్లను సీపీఐ కోరుతోంది. అయితే కాంగ్రెస్ ఒక సీటు ఇచ్చేందుకు సిద్ధమంటోంది. ఒకే సీటు ఇస్తే కనుక పొత్తు పెట్టుకోవద్దని సీపీఐ నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.

కొత్తగూడెం సీపీఐలో ముసలం

కొత్తగూడెం సీపీఐలో ముసలం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ ఒకే సీటు ఇచ్చేందుకు సిద్ధమని చెబుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సీటును సాబిర్ పాషాకు ఇవ్వాలని కొత్తగూడెం సీపీఐ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. సీట్ల కోసం అధిష్ఠానం అధికార పార్టీతో రాజీపడుతోందని వారు ఆరోపించారు. ఈ సీటును సాబిర్ పాషాకు ఇవ్వకుంటే అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేస్తామని కౌన్సిలర్లు హెచ్చరించారు.

కౌన్సిలర్ల అభిప్రాయంపై పార్టీ అంతర్గత విషయం ..చర్చించి పరిష్కరించుకుంటాం
🔸 -సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా

కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని కొత్తగూడెం మున్సిపల్ సిపిఐ పక్ష కౌన్సిలర్ల అభిప్రాయంపై చర్చించి సామరస్యంగా పరిష్కరించుకుంటామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా తెలిపారు. సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్ నందు గురువారం అయన మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నాయకత్వంలో భద్రాద్రి జిల్లాలో, కొత్తగూడెం నియోజకవర్గంలో ఐక్యంగా నిబద్దతతో పనిచేస్తున్నామని తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కూనంనేని సాంబశివరావును వచ్చే ఎన్నికల్లో గెలిపించుకోవాలని ఇటీవల జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో నిర్ణయించుకొని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు, బూత్ కమిటీలు ఏర్పాటు చేసుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో నిమగ్నమయ్యాయని తెలిపారు. జిల్లా కార్యవర్గ నిర్ణయంపై కొత్తగూడెం మున్సిపల్ సిపిఐ పక్ష కౌన్సిలర్లు మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని బహిర్గతం చేశారని, ఈ అంశాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అది పార్టీ ఆంతర్గత విషయమని తెలిపారు. అయినప్పటికీ ఐక్యంగా కూనంనేని గెలుపుకోసం అందరం కలిసి పనిచేస్తామని సాబీర్ పాషా తెలిపారు.



Related posts

మిత్ర ధర్మాన్ని పాట్టిదాం…ఉమ్మడి అభ్యర్థులను గెలిపిద్దాం…

Ram Narayana

సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ విమర్శల దాడి..!

Ram Narayana

వరంగల్ పంచాయతీ తీర్చే భాద్యత మంత్రి పొంగులేటికి అప్పగించిన పీసీసీ …

Ram Narayana

Leave a Comment