ఎన్నికల నిబంధనలను పాతర …ప్రలోభాలకు స్వేచ్చ…సిపిఎం ఘాటు విమర్శ
- అసలు వాళ్ళని వదిలి అమాయకులను పట్టుకుంటున్నారు
-ఎన్నికల నిభందనలపేరుతో వ్యాపారులకు చిక్కులు
-వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్న తనిఖీ కేంద్రాన్ని ఎత్తివేయాలి! - విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు
ఎన్నికల నిబంధనలపేరుతో చిన్న వ్యాపారులకు అమాయకులను అవసరాలకోసం డబ్బులు తీసుకోని పోయేవాళ్లను పట్టుకొని ఇబ్బందులు పెడుతూ ..అసలైన దొంగలను వదిలిపెడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఎన్నికల అధికారులపై ఘాటు విమర్శలు చేశారు .. అనేక మంది కార్పొరేటర్లను , సర్పంచులను ఇతర ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేస్తుంటే ,ప్రలోభాలకు గురిచేస్తుంటే వారికీ స్వేచ్ఛ నివ్వడం ఎన్నికల నిబంధనల కిందకు రాదా ..?అని ప్రశించారు ..ప్రజాస్వామ్యం పేరుతొ అప్రజాస్వామికంగా జరుగుతున్న ఈ నీతిమాలిన చర్యలకు అడ్డుకట్ట వేయకపోతే డబ్బున్న వాడికే ప్రజాస్వామ్యం అని అభిప్రాయాలకు బలం చేకూరుతుందని అన్నారు ..
జిల్లాలో అధికారులు, పార్టీలు యదేచ్చగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న, ఎన్నికల అధికారులు మాత్రం వారిని పట్టించుకోకుండా స్వేచ్ఛగా వదిలివేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు ఆరోపించారు. శుక్రవారం ఖమ్మం లోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా లో రెండు నెలల నుండి అధికారపక్షం ప్రధాన ప్రతిపక్షాల మధ్య ప్రజలు నాయకులను వివిధ పార్టీల ప్రతినిధులను లక్షల తో కొనుగోలు చేయటం రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఖమ్మం జిల్లాలోని జరుగుతుందని అన్నారు. ఉదయం ఒక పార్టీలో చేరిన వారు సాయంత్రం మరో పార్టీలోకి చేరుతున్నారని ఇలా మూడుసార్లు మారిన వాళ్లు కూడా ఉన్నారని కొంతమంది ఒత్తిళ్లకు గురై పార్టీలు మారుతున్నారని, బలవంతంగా మారుతున్నారని అంటున్నారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేవని బారసారాలు నడుస్తున్నాయని ఒక కార్పొరేటర్ 25 నుంచి 35 లక్షలు బేరాలు నడుస్తున్నాయని ఉన్న పార్టీలో నుంచి మరో పార్టీకి పోతే 25 లక్షలు తిరిగి అదే పార్టీలోకి వస్తే 35 లక్షలు ఇంత ఓపెన్ గా బేరసారాలు జరుగుతుంటే ఎన్నికల అధికారులు నిఘా వ్యవస్థ నిఘా బెట్టేయమని, ఇంటిలిజెన్స్ వర్గాలు ఇలా అన్ని పని చేస్తున్న ఇవన్నీ యదేచ్చగా జరుగుతున్నాయని అన్నారు ఎన్నికల నిబంధనలు పార్టీలు బాహాటంగానే ఉల్లంఘించి నాయకులను కొంటున్నట్టు అమ్ముతున్నట్టు ఓపెన్గానే జరుగుతున్న నిఘావర్గాలు ఇన్ని జరుగుతున్న ఎక్కడా కూడా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలని వచ్చిన అధికారులు ప్రలోభాలకు స్వేచ్ఛని ఇస్తున్నారని, కొనుగోళ్లు అమ్మకాలు స్వేచ్ఛగా జరుగుతున్నాయి తప్ప, ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా జరగడం లేదని అభిప్రాయపడుతున్నామన్నారు.
దీన్ని నియంత్రణచాల్సిన అవసరం ఉందని అధికారులు అనుకుంటే వారిని పట్టుకోవచ్చని కానీ వదిలేశారన అన్నారు. ఇన్ని జరుగుతున్న అధికారులు అరికట్టడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అధికారులు ఎన్నికల నిబంధనల పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు సామాన్యులు తమ అవసరాల కోసం డబ్బులు తీసుకుంటే వేరే దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చిన అధికారులు పట్టుకొని సీజ్ చేస్తున్నారని అన్నారు ఇప్పటివరకు కోట్ల రూపాయలు సీజ్ చేశారని పేర్కొన్నారు. ఈ కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా ఎన్నికలకు సంబంధించిన డబ్బులు కావని ఇవన్నీ ప్రజలు, వ్యాపారులు, రైతులు తమ అవసరాల కోసం లావాదేవీలు జరుపుకున్న డబ్బులు తప్ప వీటిని మాత్రమే అధికారులు పట్టుకుంటున్నారు ఖమ్మం మార్కెట్లో దీనిపై గురువారం ఆందోళన కూడా జరిగిందని తెలిపారు వ్యాపారస్తులు ఖరీదార్లు బ్యాంకు దగ్గర నుంచి డబ్బు తీసుకొని వస్తుంటే వారిని ఫాలో అయ్యి అక్కడికి వచ్చి పట్టుకోవడం పట్టుకోవడం వారు వ్యాపారం కోసం డబ్బులు తీసుకొని వస్తున్నామని బ్యాంకు రసీదు చూపించినప్పటికీ ఆ డబ్బులు తర్వాత తీసుకోండని డబ్బులు సీట్ చేస్తున్నారని ఆరోపించారు. రైతులు తమ పండించిన పంటలు డబ్బులు తీసుకొని వెళుతున్న వాటిని తీసుకుని వెళ్తుంటే రైతులకు ఇచ్చే డబ్బులు సైతం పట్టుకుంటున్నారని ఈ క్రమంలో రైతులు ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తున్నారని అన్నారు ఎన్నికల నిబంధనల ప్రకారం బ్యాంకు నుంచి కానీ రసీదులువై ఉంటే తీసుకెళ్లొచ్చు అని చెప్తున్నారని కానీ అధికారులు అవేవీ పట్టించుకోకుండా వారి టార్గెట్ల కోసము ఏమో కానీ ఆ డబ్బుల్ని , వాటికి సంబంధించిన పేపర్లు చూపిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా సీజ్ చేస్తున్నారని అన్నారు. దీంతో ప్రజలు, రైతులు , వ్యాపార లావాదేవీలు జరగకపోవడం వలన నష్టపోతున్నారని, తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం దీనిని సవరించాలని రైతులకు ,వ్యాపారులకు, ప్రజలకు రసీదులు ఉన్నప్పటికీ సీజ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారం రసీదులు ఉన్న డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపారులు లావాదేవీలు సరిగ్గా జరగాలంటే వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్న తనిఖీ కేంద్రాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని సమస్యని నివారించాలని డిమాండ్ చేశారు. గురువారం ముగ్గురు వ్యాపారుల ఒక్కొక్కరి వద్ద నుండి మూడు లక్షల రూపాయలు పట్టుకున్నారని దీనివల్ల రైతులు వ్యాపారులు మార్కెట్లో ఆందోళన నిర్వహించారని తెలిపారు. దీంతో కొన్ని గంటలపాటు మార్కెట్లో కొనుగోళ్లు స్తంభించాయన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఓటర్లకు పంచడానికి మద్యాన్ని నిలువలు భారీగా ఉన్నాయని, ఇప్పటికే ప్రచారాలకు తిరిగేవారికి మద్యం సరఫరా చేస్తున్నారని అంతేకాకుండా ఇంకా నిలువలు ఉంచారని దీనిపై ఎక్సైజ్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పటికే డబ్బులు పంచడానికి జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 50 కోట్ల రూపాయలు నియోజకవర్గాల్లో చేరుకున్నాయని తెలిపారు దీనిపై అధికారులు నిఘా పెడితే ఆ డబ్బులు దొరికే అవకాశం ఉందని పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో ఓట్లు ప్రజాస్వామ్య బద్ధంగా స్వేచ్ఛంగా జరగాలంటే అరుణ్ నిల్వవించిన డబ్బులను పట్టుకుంటే స్వేచ్ఛాయితంగా ఎన్నికలు జరుగుతాయి అన్నారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే బదులు ఇలాంటి డబ్బులు పట్టుకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఎన్నికల్లో ప్రలోభాలు అక్రమాలు జరగకుండా ఉంటాయని స్వేచ్ఛాయితంగా ఎన్నికలు జరుగుతాయని కోరుతున్నామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు ,నవీన్ రెడ్డి ,ఖమ్మం అర్బన్ నాయకులు యస్.కె.మీరా,
ఖమ్మం త్రీటౌన్ కార్యదర్శి భూక్యా శ్రీనివాస్
తదితరులు పాల్గొన్నారు .