ఎన్నికల తర్వాత సైకోలకోసం ఖమ్మంలో పిచ్చి ఆసుపత్రి ..మంత్రి పువ్వాడ హాట్ కామెంట్స్ !
తుమ్మల ఖమ్మం కు ఏమి చేశారో చెప్పాలి …వారి పార్టీ ఏమి చేస్తుందో చెప్పాలి
అదిచేతకాక నామీద పడి ఏడుస్తున్నారు
వాకర్స్ క్లబ్ వాళ్ళ స్టేజి సభ ఏర్పాట్ల కోసం తొలగించాం మళ్ళీ నిర్మిస్తాం ..
ఖమ్మం ప్రజా ఆశ్వీర్వాదం సభను జయప్రదం చేయండి …
కొంతమంది నన్ను సైకో అంటున్నారు, ఖమ్మం చుట్టూ పక్కల చాలా మంది పిచ్చి వారు, సైకో లు తిరుగుతున్నారు…ఎన్నికల తర్వాత ఆ పిచ్చి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక పిచ్చి ఆసుపత్రి నిర్మిస్తాం. అందులో వాళ్లకు ఆధునిక వైద్యం ఇప్పిస్తాం మని రాష్ట్ర మంత్రి, ఖమ్మం నియోజకవర్గ బీఆర్ యస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు .ఆదివారం ఖమ్మంలో జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశ్వీర్వదాసభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం స్థానిక ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన తుమ్మల నాగేశ్వరరావు తన పై చేస్తున్న విమర్శలపై ఫైర్ అయ్యారు …ఆయన 17 సంవత్సరాల మంత్రిగా జిల్లాకు ఏమి చేశారని ప్రశ్నించారు …వారి పార్టీ ఏమి చేసింది ..ఏమి చేస్తుందని చెప్పుకోలేక నిరంతరం నామీదపడి ఏడుస్తున్నదని ధ్వజమెత్తారు …
ఖమ్మంలో జరగనున్న కేసీఆర్ సభ కోసం గ్రౌండ్ లో ఉన్న స్టేజీని కళాశాల వారి పర్మిషన్ తో తిరిగి నిర్మిస్తామని తొలగించాం ..నిర్మాణం కోసం లక్ష రూపాయలు డిపాజిట్ కూడా చేశాం ..దానికి మేమేదో కట్టడాలు కూల్చినట్లు మాట్లాడటం విడ్డురంగా ఉందని అన్నారు ..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశమే నాశనం అయ్యింది, ఇందులో మొదటగా కూల్చింది బాబ్రీ మసీదు..మేమేమైనా గుడిని కానీ, చర్చిని కానీ, మస్జీద్ లను కానీ కూల్చామా, లేదా తిరిగి మేము ఆ స్టేజ్ నిర్మించమని చెప్పామా.. ఎందుకు పనికిరాని మాటలు.. ఊక దంపుడు మాటలు అని పువ్వాడ మండిపడ్డారు..
ఖమ్మంలో ఇసుక, మట్టి మాఫియా చేస్తున్నాం అంటున్నారు. ఖమ్మంలో అస్సలు ఇసుక ఎక్కడ ఉంది. గోదావరి, గంగ కృష్ణా నదులు ఉన్నాయా..? ఉన్నది మున్నేరు అది కూడా రాళ్లతో ఉంది కళ్ళు లేవా అందులో ఇసుక ఎక్కడ ఉందని తెల్వదా అని ఆగ్రహం ప్రకటించారు .
రెండు గంటలకే ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు హాజరు కావాలి, 4 గంటల వరకు సభ ముగుస్తుంది. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరుతున్న.
ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ …బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ విజయాన్ని కాంక్షిస్తూ ప్రజా ఆశీర్వాద సభ సీఎం కేసీఆర్ వస్తున్నారు … కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రానున్నారు …అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేశామన్నారు .ఖమ్మం అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమైంది …జిల్లానే కాదు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేశారు … దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధి మాకు కావాలని కోరుతుంది.. కేసీఆర్ పాలన రాష్ట్రమే కాదు దేశం కోరుకుంటుంది..
ఎన్నికలు వచ్చాయి అంటే కాంగ్రెస్ వాళ్ళు ఊపుకుంటూ వస్తారు….మాయమాటలు చెపుతారు వారి మాటలు నమ్మితే నట్టేట మునిగినట్లే ..ప్రజల గురించి కాకుండా నిత్యం పదవుల గురించి మాత్రమే వారు ఆలోచిస్తారు .కాంగ్రెస్ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించలేదు. వాళ్ళ పదవులు, అధికారం కోసం తప్పా..కాంగ్రెస్ మంచిగా ఉండి ఉంటే దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీ వచ్చేది కాదు. దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అభివృద్ధి జరిగింది. జిల్లాలో 10 కి 10 సీట్లు గెలిపించాలి అని పిలుపు నిచ్చారు ..