Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్
శీనన్న తరపున నామినేషన్ దాఖలు చేసిన సోదరుడు ప్రసాద్ రెడ్డి

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తరఫున ఆయన సోదరుడు పొoగులేటి ప్రసాద్ రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నిoగ్ అధికారి రాజేశ్వరికి ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ ప్రతులు అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, జిల్లా నాయకులు బైరు హరినాథబాబు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు బొందయ్య, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడిత్యా పెట్రామ్ నాయక్ ఉన్నారు.

9వ తేదీన శీనన్నమరో సెట్ నామినేషన్ దాఖలు..

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తరఫున నామినేషన్ దాఖలు చేశాక.. విలేకరులతో పొoగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. పాలేరు ప్రజలు శీనన్నను భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 9వ తేదీన పొంగులేటి శీనన్న పాలేరు ఎన్నికల కార్యాలయానికి వచ్చి స్వయంగా తన నామినేషన్ దాఖలు చేస్తారని ప్రకటించారు.రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని శీనన్నకు భారీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ..

Related posts

టీయూడబ్ల్యూజే (ఐజేయూ )కృషి ఫలితం …జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ..

Ram Narayana

ఈ నెల 25న రాష్ట్ర గవర్నర్ పర్యటన.. అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ

Ram Narayana

పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించాలని వద్దిరాజు విస్త్రత ప్రచారం …

Ram Narayana

Leave a Comment