Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఉమ్మడి ఖమ్మంజిల్లాలో మిగతా ఐదు స్థానాల్లో ఇకటి సిపిఐ ..4 కాంగ్రెస్…

ఉమ్మడి ఖమ్మంజిల్లాలో మిగతా ఐదుస్థానాల్లో ఇకటి సిపిఐ ..4 కాంగ్రెస్…
కొత్తగూడెం సిపిఐ కి కేటాయింపు …కూనంనేని సాంబశిరావు దాదాపు పోటీ
ఇల్లందు …. కోరం కనకయ్య మాజీ ఎమ్మెల్యే
అశ్వారావుపేట ….జారే ఆదినారాయణ
వైరా …విజయాబాయి
సత్తుపల్లి …మట్టా రాగమయికే అవకాశాలు

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంకా 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం అయినప్పటికీ ఇంకా ప్రకటించలేదు …దీంతో ఆశావహులు నిరుత్సాహంతో ఉన్నారు …ప్రకటించాల్సిన స్థానాల్లో ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఐదు ఉన్నాయి. వీటిలో కొత్తగూడెం జనరల్ సీటు సిపిఐ కి ఇచ్చేందుకు కాంగ్రెస్ తో అంగీకారం కుదిరినట్లు సమాచారం …సిపిఐ కి ఒక సీటు తోపాటు ఒక ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇవ్వగా ,వారు మునుగోడులో స్నేహపూర్వక పోటీ చేస్తామని అంటున్నారన తెలుస్తుంది..అందుకు కాంగ్రెస్ అభ్యంతరం పెట్టిందని అంటున్నారు ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం సిపిఐ కి కేటాయించడంతో అక్కడ నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీచేయనున్న .అయితే ఆపార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది…ఇక మిగతా నాలుగు నియోజకవర్గాల్లో ఇల్లందు నుంచి కోరం కనకయ్య ,వైరా నుంచి విజయాబాయి , అశ్వారావు పేట నుంచి జారే ఆదినారాయణ పోటీ ఖాయమని తెలుస్తుంది..ఇక సత్తుపల్లి నుంచి మట్టా దయానంద్ సతీమణి రాగమయి కె దాదాపు సీటు ఖరారు అంటున్నారు . సుధాకర్ పేరు బాగానే వినిపిస్తున్న సర్వేలో మట్టా రాగమయికే అనుకూలంగా ఉన్నట్లు సమాచారం…దీంతో అధిష్టానం మట్టా రాగమయి వైపే ముగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది….

లెఫ్ట్ పార్టీల్లో సిపిఎం కాంగ్రెస్ తో పోటీకి దూరంకాగా, సిపిఐ పొత్తు పెట్టుకోవడం ఆసక్తిగా మారింది.. విడివిగా చర్చలు జరిపిన కాంగ్రెస్ తో ప్రయాణ చేసే విషయంలో కలిసే వెళ్లాలని నిర్ణయించుకున్న పార్టీలు చేరేదారి అవడంపై రాకకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది… సిపిఎం కూడా మిర్యాలగూడెం ఒక్క సీటు ఇచ్చి సిపిఐ లాగానే ఎమ్మెల్సీ ఇస్తామంటే ఒప్పుకుంటా ..? లేదా ..? అనేది చూడాలి ..అయితే ఇప్పటికే తాము పోటీచేయదల్చుకున్న 17 నియోజకవర్గాల పేర్లను ప్రకటించింది…ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు …

Related posts

సుంకిశాల ఎవరి పాపం …? డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

ఎన్నికల్లో మనతో ఉన్నోడే మనోడు…అవకాశవాదులు పార్టీలో స్థానంలేదు…సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

కాంగ్రెస్ గూటికి తుమ్మల …హైద్రాబాద్ నివాసంలో తుమ్మలతో రేవంత్ భేటీ …!

Ram Narayana

Leave a Comment