Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కరటక దమనకులు” అంటే ఏమిటి…? కేసీఆర్ పద ప్రయోగంపై ఆరా ..!

కరటక దమనకులు” అంటే ఏమిటి…? కేసీఆర్ పద ప్రయోగంపై ఆరా ..!
పంచతంత్రంలో చిన్నయసూరి చిన్నపిల్లకోసం రాసిన కథలో ఉపయోగించిన పత్రాలు
తుమ్మల ,పొంగులేటిని ఉద్దేశించి కేసీఆర్ ఖమ్మంలోనూ, కల్లూరు లో ఉపయోగించిన పదాలు
‘కరటక దమనకులు” అంటే జిత్తులమారి నక్కలని అర్థం …

బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రాష్ట్రం నలుమూలలా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతూనే.. మరోవైపు ప్రత్యర్థి నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఇన్నాళ్లూ పార్టీలో ఉండి.. తీరా ఎన్నికల సమయంలో వేరే పార్టీలో చేరిన వారిని టార్గెట్ చేస్తున్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఇద్దరు నాయకులను ఉద్దేశించి ‘కరటక దమనకులు’ అంటూ సంభోదించారు. ఆ మాటకు అర్థం ఏంటో చాలా మందికి తెలియలేదు. దీనిపై అసలు కేసీఆర్ తిట్టినతిట్టు ఏమిటని ఆరా తీశారు …

ఖమ్మంలో ఆదివారం పువ్వాడ అజయ్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ప్రజా ఆశ్వీరవాదసభలో జిల్లాకు చెందిన ఇద్దరు నాయకుల గురించి సెటైర్లు వేశారు. వారి పేర్లు చెప్పకపోయినా ‘కరటక దమనకులు’ అంటూ సంభోదించారు. 

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించే ఈ మాట ప్రయోగించారు. సాధారణంగా ప్రెస్ మీట్లు, బహిరంగ సభల వేదికలపై ప్రత్యర్థులపై కాస్త ఘాటైన విమర్శలు చేయడం కేసీఆర్‌కు అలవాటు. కానీ వీరిద్దరినీ తిట్టడంలో మాత్రం ఒక తెలియని పదాన్నివాడటంతో ప్రత్యర్థులు సైతం జుట్టుపీక్కుంటున్నారు ..

పరవస్తు చిన్నయ సూరి అనే పండితుడు చిన్నపిల్లల కథలు పంచతంత్రంలో బాగా రాసేవారు. ఒకప్పుడు ఆయన రాసిన కథలను పిల్లలకు పెద్దలు వివరించేవారు. ఇప్పుడు అలా ఎవరూ చేయడం లేదు కదా. అయితే సాహిత్యంపై గొప్ప అవగాహన ఉన్న కేసీఆర్ మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి పద ప్రయోగాలు చేస్తుంటారు. చిన్నయ సూరి రాసిన కథలో కరటకుడు, దమనకుడు అనేవి రెండు పాత్రలు. అవి రెండు మోసం చేసే జిత్తులమారి నక్కలుగా చిన్నయ సూరి చిత్రించాడు. 

ఆ రెండు నక్కలు తెలివిగా ఉంటూ, ఎదుటి వారిని మోసం చేయడంలో చాలా దిట్ట. అంతే కాకుండా అద్భుతంగా నటిస్తుంటాయి కూడా. అలాంటి మోసపూరిత నక్కల పేర్లను అడ్డం పెట్టి తుమ్మల, పొంగిలేటిని తిట్టేశారు. పెద్దగా వివరించకుండానే వారి మనస్తత్వం ‘కరటక దమనకులు’ వంటి జిత్తులమారి నక్కలని తేల్చిపారేశారు. ఇదీ కేసీఆర్ ప్రయోగించిన ఆ పదానికి అసలు అర్థం.

Related posts

ఖమ్మం పార్లమెంటుకు మంత్రుల కుటుంబసభ్యులకు నో టికెట్ …తేల్చిచెప్పిన కాంగ్రెస్ అధిష్టానం…

Ram Narayana

మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీకే గ్యారెంటీ: కామారెడ్డి సభలో మోదీ

Ram Narayana

ఖమ్మంకు తుమ్మల…. పాలేరుకు పొంగులేటి….?

Ram Narayana

Leave a Comment