Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తుమ్మలకు సిపిఐ (ఎం ఎల్ )ప్రజాపంథా మద్దతు ….

తుమ్మలకు సిపిఐ (ఎం ఎల్ )ప్రజాపంథా మద్దతు ….
సిపిఐ (ఎం ఎల్ ) ప్రజాపంథా మద్దతు కోరిన తుమ్మల…బీజేపీ బీఆర్ యస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు అన్న పోటు రంగారావు …
సోమవారం ఉదయం స్థానిక సీపీఐ (ఎం ఎల్ ) ప్రజాపంథా కార్యాలయానికి వెళ్లిన తుమ్మల
ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు,జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు ను మర్యాద పూర్వకంగా కలిసి తుమ్మల
తుమ్మల తమ కార్యాలయానికి రావడంతో సాదరంగా ఆహ్వానం పేలిన ఎం ఎల్ నేతలు
ఫాసిజానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందన్న ప్రజాపంథా నేతలు

కాంగ్రెస్ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ,మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు సిపిఐ (ఎం ఎల్ ) ప్రజాపంథా మద్దతు ప్రకటించింది.. తుమ్మల సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా సిపిఐ (ఎం ఎల్ ) ప్రజాపంథా కార్యాలయాన్ని సందర్శించారు .. పార్టీ కార్యాలయంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు ను కలిసి మద్దతు కోరారు ..ఈసందర్భంగా జిల్లా అభివృద్ధికి తాను చేసిన కృషిని ప్రత్యేకించి ఆటవీ ప్రాంతంలో వారితో పంచుకున్నారు .ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ నేను మీ కమ్యూనిస్టుల ఎజెండా అమలు చేశా …. నా జీవితం కూడా అడువులతోనే ముడి పడి ఉంది …. నాకు వచ్చిన అవకాశాన్ని పేదలకు ,ప్రధానంగా అడవుల్లో ఉండే అమాయకులైన గిరిజనుల మౌలికవసతుల కల్పనకు కృషి చేశా… ఇల్లందు భద్రాచలం,గుండాల వంటి మారుమూల ప్రాంతాల్లో నేను చేసిన అభివృద్ధి, పేద ప్రజలకు కల్పించిన మౌలిక సదుపాయాలు మీ అందరికీ తెలియంది కాదు … పేద ప్రజల అభ్యున్నతి కోసం,మీరు ఏ ఆశయాల కోసం పోరాడుతున్నరో…ఆ ఆశయాలను సాధించడం కోసం నేను సైతం మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు….రాష్ట్రంలో,ఖమ్మంలో జరుగుతున్న అరాచక పాలనను అంతమొందిండానికి రాబోయే ఎన్నికల్లో నాకు మద్దతు ఇవ్వాలని
కోరారు……

ఈ కార్యక్రమంలో పోటు రంగారావు మాట్లాడుతూ దేశంలో బిజేపి పార్టీ,రాష్ట్రంలో బి.అర్. యస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఇటు దేశాన్ని,రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తూ దివాలా తీయిస్తున్నారని ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేఖంగా సీపీఐ (ఎం ఎల్ ) ప్రజాపంథా పోరాడుతుందని అందుకే బిజేపి,బీఆర్ యస్ పార్టీలకు వ్యతిరేఖంగా పోరాడి గెలిచే పార్టీలకు వ్యక్తులకు మా మద్దతు వుంటుందని తెలిపారు….తాము గతంలో భూర్జవపార్టీలకు దూరంగా ఉన్నామని అయితే దేశంలో ముంచుకొస్తున్న ఫాసిజాన్ని ఓడించాలంటే ప్రజాస్వామ్యశక్తులకు మద్దతు ఇవ్వాలని తమ పార్టీ కేంద్రకమిటీ నిర్ణయించిందని ఆ మేరకు ఖమ్మంలో బీఆర్ యస్ , బీజేపీ వ్యతిరేకంగా ఉన్న బలమైన శక్తులకు బలపరచాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు .దీంతో ఖమ్మంలో తుమ్మలకు మద్దతు ఇచ్చేందుకు ప్రజాపంథా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం ..

ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం ఎల్ ప్రజపంథా నాయకులు అవుల వెంకటేశ్వర్లు,ఆవుల అశోక్,సివై పుల్లయ్య,జి.రామయ్య,మనోహర్ రాజు,ఝాన్సి,శిరోమణి,నామాల ఆజాద్,శ్రీనివాస్,చందు,మందా సురేష్,రాయల రవి కుమార్,బల్లేపల్లి వెంకటేశ్వర్లు తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు….

Related posts

కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది: కేటీఆర్

Ram Narayana

ఎన్నికలకు సిద్ధంకండి: కిషన్ రెడ్డి

Ram Narayana

 బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు!: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం

Ram Narayana

Leave a Comment