నాన్నను కట్టిపడేసిన పాలేరు ప్రజల ప్రేమ …కుమార్తె దీప్తిరెడ్డి…
కుటుంబంకన్నా పాలేరు ప్రజలకోసమే ఆయన తపన
తమకు అదే ప్రేమ పంచుతున్న ప్రజలు
పాలేరులో కందాల కుటుంబసభ్యుల ఇంటింటా ప్రచారం
భార్య విజయమ్మ పెద్ద కుమార్తె దీపికా రెడ్డి సైతం ప్రజలతో మమేకం
నాన్న కందాల ఉపేందర్ రెడ్డి గారు మేము ఎప్పుడు ఫోన్ చేసి అడిగినా, ఎక్కడ ఉన్నారంటే పాలేరులో అనేవాళ్ళు …పండుగలకు పబ్బాలకు కూడా మాతో గడపడంలేదు …దీంతో మాకే విసుగు వచ్చేది ..ఏమిటి ఎప్పడు పాలేరు అంటరాని చికాకు పడ్డాం… ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కుటుంబంతో గడపడం తగ్గిపోయింది…ఏమిటి ప్రజలు …ప్రజలు అంటరాని అనుకున్నాం…ఏముంది ప్రజల్లో గొప్పతనమని అడిగాం మీరు కూడా రండి తెలుస్తుంది వారి ప్రేమ ఒక్కసారి వచ్చి చూడండి… మీకు అర్థం అయితే వదిలి పెట్టరని అన్నారు ….
నాన్నకు తిరిగి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం వచ్చింది..దీంతో ప్రచార నిమిత్తం మేము నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు, ప్రజల నుంచి మాకు లభిస్తున్న ఆదరణ చూసి ఆశ్చర్యం వేసింది..నాన్నగారు ప్రజల్లో ఎంత పేరు సంపాదించుకున్నారో అర్ధం అయింది …తిరుగుతున్నప్పుడు టైం కూడా తెలవడంలేదు …అన్ని చోట్ల నాన్నగారి మంచితనం గురించి ప్రజలు చెపుతున్నప్పుడు గర్వమనిపించింది .నిజంగా మంచి అనే మాట కోట్లు పెట్టుకొన్న రాదు… నాన్నకు వచ్చింది..అందుకు కారణం ఆయన స్పందించే తీరు అని ప్రజలు చెపుతున్నారు… ఎప్పుడు ఏ అవసరం కోసం వెళ్లిన లేదు …కాదు అనేవారు కాదు అని చెప్పడం విని ఉప్పొంగిపోయామని అన్నారు … పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న మా నాన్నగారికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి గర్వపడుతున్నామని దీప్తి రెడ్డి అన్నారు.
పాలేరు మా కుటుంబం వారు ప్రేమ తో మమ్మల్ని కట్టి పడేసారు పాలేరు ప్రజలతో వున్నా అనుబంధం ఎవ్వరు విడదీయాలేరు…. పక్క లోకల్ కందాళ గారినే గెలిపిస్తారు
కందాళ ఉపేందర్ రెడ్డి గారి చిన్న కుమార్తె దీప్తి రెడ్డి
ఎదులాపురం గ్రామం లో గడప గడపకు కందాళ ఉపేందర్ రెడ్డి కారు గుర్తు కై ప్రచారం చేసిన కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి విజయమ్మ చిన్న కుమార్తె దీప్తి రెడ్డి అనంతరం కందాళ అభిమానులు ఊరురా కందాళ స్వచ్ఛందా ప్రచారాన్ని ప్రారంభించి ర్యాలీ లో పాల్గొన్నారు
ఖమ్మం రూరల్ మండలం లోని ఆర్టీసీ కాలనీ, కేబీఆర్ నగర్ 1.2,జలగంనగర్, నాయుడుపేట, నడిమితండా లో గడప గడప ప్రచారం లో పాల్గొన్న కందాళ ఉపేందర్ రెడ్డి సతీమణి విజయమ్మ పెద్ద కుమార్తె దీపిక రెడ్డి, చిన్న కుమార్తె దీప్తి రెడ్డిలు కారు గుర్తు పై ఓటు వేయాలని ప్రచార కార్యక్రమం నిర్వహించారు.