తెలంగాణ రాజకీయ వార్తలు ..

గీత దాటితే వేటు తప్పదు … కామారెడ్డి నేతలకు కేసీఆర్ వార్నింగ్ …

 పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవు: కేసీఆ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. గజ్వేల్ లో ఉదయం నామినేషన్ వేసిన కేసీఆర్… అక్కడి నుంచి కామారెడ్డికి చేరుకున్నారు. కామారెడ్డిలో నేరుగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటికి వెళ్లారు. అక్కడ నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. కామారెడ్డిలో ఇటీవల చోటుచేసుకున్న వివాదాలపై ఆయన ఆరా తీశారు. గ్రూపు తగాదాలను వీడాలని, అందరూ కలసికట్టుగా పని చేయాలని సూచించారు. ఎవరైనా పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లొద్దని చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 

Related posts

కాంగ్రెస్ ను కర్ణాటక క్షమించదు.. తెలంగాణ విశ్వసించదన్న మంత్రి కేటీఆర్

Ram Narayana

భవిష్యత్ ముఖ్యమంత్రిని నేనే.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

బీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్…

Ram Narayana