Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జలగం వెంగళరావుకు వచ్చిన నాకు రాబోతుంది…భట్టి


జలగం వెంగళరావు కు వచ్చిన అవకాశం మీ బిడ్డగా నాకు రాబోతుంది

మధిర బిడ్డగా నన్ను నాలుగో సారి ఆశీర్వదించండి

ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపడతాను

నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్నది

కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర దశా దిశా నిర్దేశించేదిగా ఉండాలి

బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దంచడానికి దించడానికి ప్రజలు రెడీ

మధిరలో భట్టి విక్రమార్క కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

జన సునామిగా తలపించిన నామినేషన్ ర్యాలీ

నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీమంత్రి అవినాష్ వజ్హర్


ఖమ్మం బిడ్డ జలగం వెంగళరావు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాకు బిపిఎల్, స్పాంజ్ ఐరన్ కంపెనీ, హెవీ వాటర్ ప్లాంట్, ఆనేక పరిశ్రమలు ఇచ్చింది. మళ్లీ ఆలాంటి అవకాశం ఖమ్మం జిల్లాకు రాబోతుంది. మధిర బిడ్డగా నన్ను మీరు ఆశీర్వదించి గెలిపిస్తే అలాంటి అభివృద్ధిని ఖమ్మం కు తీసుకువస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గురువారం సిపిఐ తెలుగుదేశం పార్టీ బలపరిచిన మధిర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా భట్టి విక్రమార్క తహాశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వేలాది మందితో జన సునామీ తలపించే విధంగా మధిర పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో మహారాష్ట్ర మాజీ మంత్రి ఎన్నికల పరిశీలకులు అవినాష్ వజ్హర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రజలను కార్యకర్తలను, ఉద్దేశించి భట్టి విక్రమార్క ప్రసంగించారు
ఆనాడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ఉన్నందున
నాగార్జునసాగర్ నీళ్లు ఖమ్మం జిల్లాకు రావడానికి సాధ్యమైందన్నారు‌. నేడు చదువుకున్న యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు, విద్యాసంస్థలు, వ్యవసాయ పరిశ్రమలు తీసుకు రావాలంటే మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని కోరారు. మీ బిడ్డగా విజ్ఞప్తి చేస్తున్న అనేక ప్రాజెక్టులు, పరిశ్రమలతో ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, అందుకోసం కాంగ్రెస్ కార్యకర్తలు కంకణబద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంగళరావుకు మాత్రమే సీఎల్పీ నేతగా పనిచేసే అవకాశం ఆనాడు దొరికిందని, ఆ తరువాత మధిర ఓటర్ల ఆశీస్సులతో ఆ అదృష్టం తనకు కలిగిందన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినందునే మధిర ప్రజలు ఇప్పుడు ఐదు వేళ్ళతో అన్నం తింటున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పీజీలు, డిగ్రీలు ఉన్నత చదువులు చదివిన యువకులు కొలువులు రాకపోవడంతో రోజువారి కూలీలుగా పని చేసుకోవాల్సిన దుస్థితికి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని మండిపడ్డారు. ప్రజల సంపద ప్రజలకు చెందకుండా అడ్డుపడిన దోపిడీ దారుడు, పెద్ద దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికి పంపిస్తేనే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుందన్నారు.
నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రకటించిన ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తుందన్నారు.
ఆరు గ్యారంటీలతో పాటు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని, ఉన్నత చదువులు చదివుతున్న విద్యార్థీణుకు బ్యాటరీ స్కూటీలు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. పదేళ్లుగా బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంపదను దోపిడీ చేసినందువల్లే తెలంగాణ అభివృద్ధి జరగలేదన్నారు.
పరిపాలనలో అపారమైన అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా చెబుతున్నాను. ఆర్థిక దోపిడిని అరికడితే ఆరు గ్యారెంటీలను అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం లో దోపిడీ ఉండదు. అవినీతి రహిత పరిపాలన అందిస్తామని ఎలాంటి నిధులు కొరత లేకుండా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని వివరించారు.
ప్రపంచ ప్రజలు వచ్చి చూడాలని గొప్పలు చెప్పిన కాలేశ్వరం ప్రాజెక్టు బిఆర్ఎస్ ప్రభుత్వం కడితే పట్టుమని పది రోజులకే కృంగిపోయిందని, జాతీయ సేఫ్టీ డ్యాం అధికారులు ఇప్పుడు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించాలని నివేదిక ఇచ్చారని చెప్పారు. నాగార్జునసాగర్ శ్రీశైలం ఎస్సారెస్పీ లాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కడితే ఇప్పటికి చెక్కుచెదరలేదని. కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, అవినీతి రహిత పాలనకు ఇవి నిదర్శనమని పేర్కొన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టు పట్టుమని పది రోజులకే కృంగిపోవడం బిఆర్ఎస్ పాలకులు ప్రాజెక్టు కేటాయించిన నిధులను పంచుకు తినడమే కారణమని దుయ్యబట్టారు.
అనేక హామీలు వాగ్దానాలు మాయమాటలు చెప్పి 10 ఏండ్లుగా మోసం చేసిన బిఆర్ఎస్ పాలన ఇక చెల్లదని రాష్ట్రంలో ప్రజల తిరుగుబాటు మొదలైందని, ఇక
బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దంచుదాం- దించుదామని ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు గజ్వేల్ లో ప్రజల నుంచి సెగ తాకడంతో కామారెడ్డికి పారిపోయాడని, ప్రజల సెగ తట్టుకోలేక ఆ పెద్దాయన పారిపోతేనే అతి గతి లేదని మధిరలో ఈయన ఎంత? అంటూ బిఆర్ఎస్ అభ్యర్థి పై పరోక్ష విమర్శలు చేశారు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ద్వారా తాను రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను కదిలించి రాష్ట్ర సంపద దోపిడీ చేస్తున్న బిఆర్ఎస్ పాలకులపై అలుపెరుగని పోరాటం చేశానని వివరించారు. వందమంది కౌరవులు ఉన్నట్టుగా
శాసనసభలో బిఆర్ఎస్ పాలకులు ఒకవైపు ఉంటే..‌ ఐదుగురు శాసనసభ్యులను వెంటపెట్టుకొని పాండవుల వలె అంతిమ విజయం మాదే అని గొంతు ఎత్తి మాట్లాడాటానికి అంత ధైర్యం ఇచ్చింది మధిర ఓటర్లు అని అన్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది ఆపధర్మ ప్రభుత్వమేనని, బిఆర్ఎస్ పాలకులకు ఏలాంటి అధికారులు లేవన్నారు. రాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ ఆగడాలకు ఇక భయపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
పోలీసులు, అధికార యంత్రాంగం బిఆర్ఎస్ కు తాబేదారులుగా పనిచేస్తామని అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
బి ఆర్ ఎస్ కి తాబేదారులుగా పనిచేసే అధికారుల లెక్కలు అధికారంలోకి వచ్చాక లెక్కతీస్తామన్నారు.
నెల రోజుల్లో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మధిర నియోజకవర్గం దశా దిశా నిర్దేశం చేసే విధంగా ఉండేందుకు ప్రజలు నాలుగో సారి నాకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేసే క్రమంలో మధిర బిడ్డగా ఎక్కడ తలదించలేదు. తల ఎత్తుకునే విధంగానే పనిచేశానని వెల్లడించారు.

Related posts

మహిళా ఐపీఎస్ రాత్రిపూట సైకిల్ పై గస్తీ సీఎం అభినందన!

Drukpadam

విశాఖ హెచ్ పీసీఎల్ లో భారీ అగ్నిప్రమాదం….

Drukpadam

ఖమ్మంలో జర్నలిస్టులకు ఆయుర్వేద వైద్య శిబిరం విజయవంతం!

Drukpadam

Leave a Comment