- బెంగళూరు శివారులో చెత్త ఏరుకుంటున్న సల్మాన్‌కు కనిపించిన డాలర్ల కట్టలు
- విషయాన్ని తన యజమాని బొప్పా దృష్టికి తీసుకెళ్లిన సల్మాన్
- బెంగళూరు కమిషనర్‌కు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు ప్రారంభం
- బ్లాక్ డాలర్ స్కామ్ నిందితులు డాలర్లను పారేసి వెళ్లుంటారని పోలీసుల అనుమానం
చెత్త కుప్పలో ఏకంగా రూ.25 కోట్ల విలువైన డాలర్ నోట్లు ఉన్న ఘటన బెంగళూరులో కలకలం రేపుతోంది. మొత్తం 23 నోట్ల కట్టలు బయటపడ్డాయి. సల్మాన్ షేక్ అనే వ్యక్తి నగర శివారులో నవంబర్ 1న చెత్త ఏరుతుండగా ఇవి కనిపించాయి. ఆశ్చర్యపోయిన అతడు వీటిని తీసుకుని ఇంటికెళ్లిపోయాడు. నవంబర్ 5న ఆ మొత్తాన్ని తన యజమాని బొప్పాకు అప్పగించాడు.
ఆ తరువాత బొప్పా, స్థానిక సామాజిక కార్యకర్త కలిముల్లాతో కలిసి వెళ్లి బెంగళూరు పోలీసు కమిషనర్‌కు ఈ విషయాన్ని వివరించారు. దీంతో, ఆయన కేసు దర్యాప్తు చేయమని హెబ్బల్ పోలీసులను ఆదేశించారు. కాగా, ఈ నోట్లపై రకరకాల రసాయనాలు పూసి ఉన్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. బ్లాక్ డాలర్ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠాకు చెందిన వారు ఈ నోట్లను చెత్తలో పడేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డాలర్లు నకిలీవో కాదో తేల్చేందుకు పోలీసులు వీటిని ఆర్‌బీఐకి పంపారు.