పొంగులేటి ఇల్లు ,సంస్థలపై ముగిసిన ఐటీ దాడులు …
నిన్న ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు సోదాలు
ఖమ్మం నుంచి భార్య , కుమారుడు ,తమ్ముడిని హైద్రాబాద్ తీసుకోని వెళ్లిన ఐటీ అహఁధికారులు
మొత్తం 33 చోట్ల ఏకకాలంలో సోదాలు
ఎన్నికల వేళ పొంగులేటి మానసికంగా దెబ్బతీసేందుకే దాడులన్న కాంగ్రెస్
ఎన్ని దాడులు చేసిన భయపడే ప్రస్తకే లేదని అన్న పొంగులేటి
ఖమ్మం మాజీ ఎంపీ పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లలో , సంస్థలలో గత రెండు రోజులుగా జరిపిన ఐటీ దాడులు శుక్రవారం మధ్యాహ్నం ముగిశాయి. కుటుంబసభ్యులు అంతా ఎన్నికల ప్రచారం భాగంగా గత 15 రోజులకు పైగా ఖమ్మంలో మకాం వేశారు ..ఖమ్మంలో ని వారి నివాసంలో గురువారం 13 గంటల పాటు సోదాలు నిర్వహించారు . అయినా ఏమి దొరకలేదని , కుటుంబ అవసరాల కోసం ఉంచుకున్న కేవలం లక్షన్నర రూపాయల మాత్రమే ఉన్నాయని సోదాలు ముగిసిన అనంతరం పొంగులేటి మీడియా కు తెలిపారు ..ఖమ్మం లో ఉన్న తన భార్య , కొడుకు ,తమ్మడు ప్రసాద్ రెడ్డిలను హైద్రాబాద్ కు ఐటీ అధికారులు వారి వెంట తీసుకోని పోయారు ..అయితే హైద్రాబాద్ లో ఉన్న ఇంటి ఆఫీస్ తాళాలను ఇస్తామని చెప్పినప్పటికీ మీరు ఉండాలని చెప్పి వారిని తీసుకోని వెళ్లారని అన్నారు .శుక్రవారం రోజున హైద్రాబాద్ లోని రాఘవ కంపెనీ లోను హైద్రాబాద్ ఇంటిలోని , బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు . అయితే పొంగులేటి ఇంటిలోనూ , కంపెనీ లోను పెద్ద ఎత్తున డాక్యూమెంట్స్ ,ఇతర వస్తువులు దొరికాయని వాటిని బస్తాల్లో తీసుకోని వెళ్లారని ప్రచారం జరిగింది..అయితే ఐటీ అధికారులు పొంగులేటి ఇంటిలో ఎలాంటివి దొరికాయనేది ప్రకటించలేదు …
ఎన్నికల వేళ కేవలం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేందుకు బీజేపీ ,బీఆర్ యస్ కుమ్మక్కై దాడులకు పురికొల్పాయని పొంగులేటి ఆరోపించారు …దాడులు చేస్తారని ముందే ఉహించానని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో బీఆర్ యస్ కుమ్మక్కు అయిందని బీఆర్ యస్ సూచన మేరకే ఈ దాడులు జరిగాయి గట్టిగ నమ్ముతున్నానని పొంగులేటి అన్నారు .
అకౌంటెంట్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి ఎవరిచ్చారు అధికారం…పొంగులేటి ఆగ్రహం
తన అకౌంటెంట్ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఒంటికాలుపై నిలబెట్టారని ఐటీ అధికారులపై మండిపడ్డారు. పరిధిని దాటి ఐటీ అధికారులు వ్యవహరించడం దారుణమని అన్నారు. ఐటీ అధికారుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని… వారు వారి హద్దుల్లో ఉండాలని చెప్పారు. ఐటీ రూల్స్ తెలియని వారు ఇక్కడ ఎవరూ లేరని అన్నారు. ఐటీ అధికారులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏమైనా ఆధారాలు దొరికితే కేసులు పెట్టాలే కానీ… మనుషులను హింసించడం ఏమిటని మండిపడ్డారు.
ఎన్ని దాడులు చేసిన జైల్లో పెట్టిన వెనకడుగు వేసే ప్రసక్తి లేదు …
తన సంస్థల్లో ,తన బంధువుల ఇళ్లలో దాడులు జరిపి నన్ను మానసికంగా కుంగ దీయడం ద్వారా కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని కేసీఆర్ ఎత్తుగడగా ఉందని మండిపడ్డారు ..ఎన్ని దాడులు చేసిన చివరకు తనను జైల్లో పట్టిన వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు . జనవరి 3 వతేదీన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పొంగులేటి అన్నారు ..