Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

రాజకీయాల్లో నీతికి పాతర …అన్ని పార్టీల్లో జంపింగ్ లు

రాజకీయాల్లో నీతికి పాతర వేస్తున్నారు నేతలు ….కండువా మార్చినంత తేలిగ్గా పార్టీలు మారుతున్నారు …తమకు సీటు వస్తే ఒకరంగా రాకపోతే మరోరకంగా నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారు …ఇది అన్ని రాజకీయ పార్టీలో ఒక జబ్బుగా మారింది…దీన్ని కిందనుంచి పై వరకు నేతలందరూ ప్రోత్సహిస్తున్నారు …కొందరు పార్టీ మార్పుల కోసమే తిరుగుతున్నారు ..అసంతృప్తి నేతలకు గాలం వేయడం వారికీ పదవులు , డబ్బులు ఆశచూపి పార్టీలో చేర్చుకోవడం రివాజుగా మారింది..క్యాడర్ ను వారి స్థాయిని బట్టి రేటు నిర్ణయం జరుగుతుంది.. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ నుంచి బీఆర్ యస్ లో చేరారు …కాంగ్రెస్ లో అనేక పదవులు అనుభవించిన ఆయన జనగాం సీటు ఆశించారు …అది రావడంలేదని తెలిసి పార్టీకి గుడ్ బై చెప్పారు …అయితే ఆయనకు జనగాం సీటు బీఆర్ యస్ ఇచ్చిందా అంటే అదీలేదు …మరి ఎందుకు చేరినట్లు అనేది చర్చనీయాంశంగా ఉంది…అంతే కాదు మరి బీసీలకు అధికంగా సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ లో పొన్నాల డిమాండ్ చేశారు …మరి బీఆర్ యస్ బీసీలకు అధికంగా సీట్లు ఇచ్చారా ..? అది లేదు …ఇక ఖమ్మం జిల్లాకు చెందిన సంభాని చంద్రశేఖర్ మాజీ మంత్రి సీనియర్ నేత సత్తుపల్లి ఎస్సీ రిజర్వడ్ సీటు కావాలని పట్టి బట్టారు…గతంలో రెండు పర్యాయాలు పోటీచేసి ఓడిపోయారు …మూడవసారి టికెట్ కావాలని అంటున్నారు …సంభానికి ఇస్తే గెలుపు సులువు కాదని కాంగ్రెస్ సర్వేల్లో తేలినట్లు చెపుతున్నారు ….టికెట్ రాక అసంతృప్తితో ఉన్న సంభానిని బీఆర్ యస్ ఎంపీలు నామ నాగేశ్వరరావు లు స్వయంగా కలిసి బీఆర్ యస్ లోకి ఆహ్వానించారు …శుక్రవారం రోజున హైద్రాబాద్ వెళ్లి బీఆర్ యస్ భవనంలో గులాబీ కండువా కప్పుకున్నారు …కొత్తగూడెం సీటు ఆశించిన ఎడవల్లి కృష్ణ పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి ఆ సీటు కేటాయించడంతో అగ్గిమీద గుగ్గిలం అయ్యారు ..ఆయన కూడా బీఆర్ యస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తో ఉన్న వైరాన్ని పక్కన పెట్టి గులాబీ గూటికి చేరుకున్నారు .అదే విధంగా ఇల్లందు మాజీ మున్సిపల్ చైర్మన్ మడత వెంకట గౌడ్ బీఆర్ యస్ లో చేరగా , బీఆర్ యస్ కు చెందిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డి .వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో చేరారు … కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సహచరుడిగా ఉన్న భద్రాచలంకు చెందిన డాక్టర్ తెల్లం వెంకట్రావు కు సీటు ఆఫర్ చేయగానే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీఆర్ యస్ చేరారు ..అయితే ఆయన టికెట్ రావడం రావడం ఫలితం దక్కినట్లుగా ఉంది… కొత్తగూడెంలో సిపిఐ కి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు ఐదుగురు బీఆర్ యస్ లో చేరడం సంచలనంగా మారింది ..కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటు సిపిఐ పార్టీకి ఇచ్చినప్పటికీ వారు పార్టీ మారడం పార్టీలోని నిర్మాణారాహిత్యాన్ని సూచిస్తుంది….కొద్దిరోజుల ముందే కొత్తగూడెం సీటు సాంబశివరావు కు బదులు ఆపార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్న షాబీర్ పాషా కు ఇవ్వాలని రహస్య సమావేశం నిర్వహించారు . దీనిపై పార్టీ నాయకత్వం జోక్యంతో వారు వెనక్కు దగ్గి పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తామని చెప్పారు …మరి ఏమి జరిగిందో తెలియదు కానీ ఐదుగురు సిపిఐ కౌన్సిలర్లు అల్ ఆఫ్ సడన్ గా హైద్రాబాద్ వెళ్లి కేటీఆర్ సమక్షంలో బీఆర్ యస్ చేరారు …కీలక సమయంలో సిపిఐ లో జరిగిన పరిణామాలు ఆపార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి …ఇక సర్పంచ్ లు ,ఎంపీటీసీలు ,జడ్పీటీసీ లు కార్పొరేటర్లు పార్టీలు మారడం సాధారణంగా జరుగుతూనే ఉంది …మరికొద్ది రోజుల్లో మరిన్ని జంపింగ్ లు జరిగే అవకాశాలు ఉన్నాయి…

Related posts

కాంగ్రెస్ పై గద్దర్ కుటుంబం రుసరుస …

Ram Narayana

టీ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు!

Ram Narayana

కాంగ్రెస్‌కు జంగా రాఘవరెడ్డి అల్టిమేటం…

Ram Narayana

Leave a Comment