కొత్తగూడెం అసెంబ్లీకి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా జలగం వెంకట్రావు….
గత ఎన్నికల్లో బీఆర్ యస్ తరుపున పోటీచేసి ఓడిపోయిన జలగం
తన ప్రత్యర్థి వనమా వెంకటేశ్వరరావు తప్పుడు అఫిడవిట్ సమర్పించాడని కోర్ట్ కు
హైకోర్టు లో జలగం కు అనుకూలంగా కోర్ట్ తీర్పు….
కొత్తగూడెం అసెంబ్లీ బరిలో జలగం దిగారు …2014 ఎన్నికల్లో టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసిన జలగం వెంకట్రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గులాబీ పార్టీ తరుపున గెలిచినా ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు …ఆయనకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు .కానీ రాలేదు ..దాంతో ఆయన గులాబీ పార్టీ పై కొంత అసంతృప్తితో ఉన్నారు .2018 ఎన్నికల్లో తిరిగి గులాబీ టికెట్ పై పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు ..కొద్దీ కాలానికే వనమా వెంకటేశ్వరరావు బీఆర్ యస్ కు జైకొట్టడంతో ఎమ్మెల్యేగా నియోజకవర్గం ఇంచార్జిగ్గా కొనసాగుతుండడంతో జలగం కార్యక్రమాలకు దూరమైయ్యారు ..అయితే ఎన్నికల్లో గెలిచినా వనమా తప్పుడు అఫడవిట్ సర్పించారని జలగం హైకోర్టు ను ఆశ్రయించారు …కోర్ట్ వనమాను ఎన్ని సార్లు పిలిచినప్పటికీ రాకపోగా సరైన వివరాలు ఇవ్వలేదని కోర్ట్ ఆయన ఎన్నిక చెల్లదని తీర్పు నిస్తూ ,జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా ప్రకటించింది …అయితే ఎన్నికల సంఘం గెజిట్ లో ప్రకటించలేదు …శాసనసభ స్పీకర్ కలిసి కోర్ట్ తీర్పు ప్రకారం తనను శాసనసభ్యుడిగా ప్రమాణం చేయించామని కోరినప్పయికి చేయించలేదు …ఈ మొత్తం ఎపిసోడ్ లో సీఎం కేసీఆర్ వనమా మద్దతు ఇవ్వడమే కాకుండా తిరిగి టికెట్ ఇవ్వడంపై జలగం ఆగ్రహంగా ఉన్నారు ….ఎన్నికల్లో పోటీచేయడం ద్వారా తన న్యాయపోరాటం కొనసాగించాలని కృతనిశ్చయంతో జలగం ఉన్నారని అర్ధం అవుతుంది …..
అందులో భాగంగానే జలగం వెంకట్రావు కొత్తగూడెం అసెంబ్లీకి ఫార్వర్డ్బ్లాక్అభ్యర్థిగా నామినేషన్ వేశారు …ఆయన స్థానికంగా కొంత క్యాడర్ ఉంది …బీఆర్ యస్ ,కాంగ్రెస్ నేతలతో సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన పోటీ ఎవరికీ లాభం లేదా స్వంత్రంత్రంగా సత్తా చాటగలరా ..? అనేది ఆసక్తిగా మారింది…బీజేపీ మద్దతుతో జనసేన కూడా పోటీచేస్తుంది…. కొత్తగూడెం లో ముక్కోణపు పోటీ లేదా చతుర్ముఖ పోటీ ఖాయమని అంటున్నారు .పరిశీలకులు …