సీఎం కేసీఆర్ దమ్మపేట ,లక్ష్మీపురం (పినపాక)సభ విజయవంతం…ఎంపీ వద్దిరాజు
జనం స్వచ్చంధంగా తండోపతండాలుగా తరలివచ్చారు:ఎంపీ రవిచంద్ర
పాటలు, నృత్యాలు, కేరింతలు,నినాదాలతో లక్ష్మీపురం దద్దరిల్లింది:ఎంపీ రవిచంద్ర
ఈ సభతో కాంతారావు, వెంకట్రావుల గెలుపు ఖాయమైంది:ఎంపీ రవిచంద్ర
ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చి విజయవంతం చేసిన వారందరికి కృతజ్ఞతలు:ఎంపీ రవిచంద్ర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట , పినపాక నియోజకవర్గం లక్ష్మీ పురంలో సీఎం కేసీఆర్ “ప్రజా ఆశీర్వాద సభలు విజయవంత మైయ్యాయని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రఅన్నారు .బీఆర్ఎస్ అధ్యక్షులు, మహానేత,తెలంగాణ అభివృద్ధి ప్రధాత,ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును స్వయంగా చూసి,వారి అద్భుతమైన ప్రసంగాన్ని చెవ్వులారా వినాలనే ఆసక్తితో అన్ని వర్గాల ప్రజల తండోపతండాలుగాతరలివచ్చారన్నారు.
జనం కాలినడకన గుంపులు గుంపులుగా, ద్విచక్ర వాహనాలు,ఆటోలు, ట్రాక్టర్లు,కార్లలో పినపాక, భద్రాచలం నియోజకవర్గాలకు చెందిన వేలాదిమంది సభాస్థలికి స్వచ్చంధంగా చేరుకున్నారని ఎంపీ రవిచంద్ర వివరించారు.డప్పులు కొడుతూ,కోలాటం ఆడుతూ,నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ,”జై తెలంగాణ జైజై తెలంగాణ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నా యకత్వం వర్థిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,” కారు గుర్తుకే మన ఓటు”అనే నినాదాలతో లక్ష్మీపురం దద్దరిల్లిందని ఒక ప్రకటనలో ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.సభాస్థలితో పాటు చుట్టుపక్కల రోడ్లలన్నీ కూడా జనంతో నిండిపోయాయని,జన ప్రభంజనం కనిపించిందన్నారు.మహనీయులు కేసీఆర్ గారి అనర్గళమైన ప్రసంగాన్ని సభికులు శ్రద్ధగా ఆలకించారని, సానుకూలంగా స్పందించారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు …సభకు హాజరైనప్రజలు ,ప్రసంగాన్ని శ్రద్ధగా వినడాన్ని చూసి ముఖ్యమంత్రి సంతోషించారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.ఈ సభ విజయవంతం కావడంతో పినపాక, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులు రేగా కాంతారావు, డాక్టర్ తెల్లం వెంకట్రావుల గెలుపు ఖాయమైందని ఎంపీ వద్దిరాజు ధీమాగా చెప్పారు.ఈ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసిన గులాబీ శ్రేణులు,అన్ని వర్గాల ప్రజలకు, ప్రెస్ అండ్ మీడియా ఎంపీ రవిచంద్ర హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.