Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ మంత్రి గంగుల కమలాకర్ కొత్త లాజిక్ …

 ఆంధ్రావాళ్లకు, మనకు జరిగే యుద్ధమే ఈ ఎన్నికలు: గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు

  • ఆంధ్రావాళ్లు… ఢిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణను దోచుకునేందుకు సిద్ధమయ్యారన్న గంగుల
  • కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌ని గెలిపిస్తే ప్రజలకు చేసిందేమీ లేదని వ్యాఖ్య 
  • ఒక్కరోజు కూడా గ్రామాల ముఖం చూడని వ్యక్తిని ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తే చేసేదేమీ ఉండదని వ్యాఖ్య

బీఆర్ యస్ మంత్రి గంగుల కమలాకర్ కొత్త లాజిక్ …

బీఆర్ యస్ కరీంనగర్ అభ్యర్థి , మంత్రి గంగుల కమలాకర్ కొత్త లాజిక్ తెచ్చారు ..ఈ ఎన్నికలలు ఆంధ్రా వాళ్లతో జరుగుతున్నా యుద్ధంగా అభివర్ణించారు …బీఆర్ యస్ భారత్ రాష్ట్ర సమితి జాతీయపార్టీగా రిజిస్టర్ చేయించుకున్నారు…ఏపీ లో కూడా బీఆర్ యస్ శాఖ ఏర్పాటు చేశారు ..మహారాష్ట్రలో స్థానికసంస్థల్లో పోటీ చేశారు …కొన్ని చోట్ల గెలిచారు …అయినా తమది ప్రాంతీయ పార్టీ అన్నట్లు మాట్లాడటం ఆపార్టీలో ఉన్న గందరగొన్ని తెలియజేస్తుంది… సీఎం కేసీఆర్ సైతం రానున్న కాలంలో ప్రాంతీయ పార్టీలదే హావ అన్నారు ….దీంతో బీఆర్ యస్ కూడా ప్రాంతీయ పార్టీ అన్నట్లుగా వారి మాటలు ఉంటున్నాయి….

ఆంధ్రావాళ్లకు, మనకు జరిగే యుద్ధమే ఈ అసెంబ్లీ ఎన్నికలు అని మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం కొత్తపల్లి మండలం మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఆంధ్రావాళ్లు… ఢిల్లీ పార్టీలతో కుమ్మక్కై తెలంగాణను మళ్లీ దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఆంధ్రావాళ్లకు, మనకు జరిగే యుద్దమే ఈ ఎన్నిక అన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులు చూసి ఓటేయాలని కోరారు.

కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌ను గెలిపిస్తే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఒక్కరోజు కూడా గ్రామాల ముఖం చూడని వ్యక్తిని ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే చేసేదేమీ ఉండదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొంగలకు ఓటు వేసి పవిత్రమైన ఓటును వృథా చేసుకోవద్దన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లోనే సుభిక్షంగా ఉంటుందని, ఇతర పార్టీల చేతిలో మోసపోతే ఇబ్బందిపడక తప్పదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు దొంగలు.. మోసగాళ్లు అన్నారు. వారి పట్ల తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.

Related posts

ఫార్ములా-ఈ కేసులో పస లేదు… అదొక లొట్టపీసు కేసు: కేటీఆర్

Ram Narayana

ఆ మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Ram Narayana

ఎవరీ బర్రెలక్క.. రాష్ట్రంతో పాటు దేశమంతటా ఒకటే చర్చ!

Ram Narayana

Leave a Comment