Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ ప్రజలకు ఏంచేయలేకపోయింది: సంజయ్ రౌత్….

-మోదీ పాలనకు ఏడేళ్లుపై శివసేన స్పందన
-అభివృద్ధి చేయాల్సింది చాలా ఉందని వెల్లడి
-ఎన్డీయే పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు
-శివసేన పాఠాలు తమకు అక్కర్లేదన్న బీజేపీ
కేంద్రంలో ఉన్న బీజేపీ తన ఏడుసంవత్సరాల పాలనలో ఏమి చేయలేక పోయిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. రెండో పర్యాయం భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ ఇప్పటివరకు ప్రజలకు వారగబెట్టింది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు . తిరిగి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కాగా, కరోనా కట్టడి కోసమే సమయం అంతా గడచిపోయిందని, ఇక ప్రజలకు ఏంచేస్తుందని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి, ప్రజాసంక్షేమం దిశగా చేయాల్సింది ఇంకా చాలా ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కోరుకుంటున్నది నిత్యావసరాలు మాత్రమేనని, అంతకుమించి వారేం కోరుకోవడంలేదని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఏంచేశారో ఎన్డీయే పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ఎన్డీయే సర్కారు మోదీ నాయకత్వంలో ఏడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంజయ్ రౌత్ కాస్తంత సామరస్యపూర్వక ధోరణిలోనే విమర్శలు చేసినా, బీజేపీ మాత్రం తీవ్రస్థాయిలో స్పందించింది.

తమకు శివసేన పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ నేత రామ్ కదమ్ ఘాటుగా బదులిచ్చారు. నిత్యం రంగులు మార్చే పార్టీ మాకు హితబోధ చేస్తోంది అని విమర్శించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే ఆశయాలను తుంగలో తొక్కారంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏంజరుగుతోందో అర్థంకాని స్థితిలో ప్రజలు ఉన్నారని శివసేన భావిస్తోందా? అని ప్రశ్నించారు. సంజయ్ రౌత్ కూడా కేంద్రం అభివృద్ధి పథకాలను ప్రశంసించినవాడేనని, కానీ ఇప్పుడు ఉన్నట్టుండి రంగులు మార్చేశారని రామ్ కదమ్ మండిపడ్డారు. అసలే వైరిపక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేనల మధ్య నెలకొన్న ఈ మాటల వార్ ఎటుదారితీస్తుందోనని పరిశీలకులు అభిప్రాయం పడుతున్నారు.

Related posts

వైసీపీ ఎన్నారై సభ్యుడు పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు!

Drukpadam

అబద్ధాల పోటీలో  చంద్రబాబు ఫస్ట్ ప్రైజ్ కు ఎంపికైనట్టే…విజయసాయిరెడ్డి

Drukpadam

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తా: ఈటల రాజేందర్ సంచలన ప్రకటన!

Drukpadam

Leave a Comment