బీ.అర్.ఎస్ పార్టీకి షాక్..రఘునాథపాలెం సర్పంచ్ పార్టీకి గుడ్ బై
తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
వారితోపాటు 20 కుటుంబాలు బీఆర్ యస్ బై బై
రఘునాథపాలెం మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ శారద ఆమె భర్త గుడిపూడి రామారావు, పరికబోడు తండా యువజన నాయకులు తేజావత్,నగేష్ గారితో పాటు ఉదయ్ నగర్ కాలనీకి చెందిన సాధిక్ గారి ఆధ్వర్యంలో, నాగమణి, భారతి, నీల , వెంకటలక్ష్మి, మల్లికమ్మ, తోపాటు 20 కుటుంబాలు బుధవారం ఉదయం తుమ్మల క్యాంప్ ఆఫీస్ నందున బిఆర్ఎస్ పార్టీ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. పార్టీ కండలు కప్పి తుమ్మల వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు ..ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ఈ ఎన్నికలు అహంకారానికి ఆభివృద్ది కి మద్య జరుగుతున్న ఎన్నికలు…అరాచకంకు ఆత్మ గౌరవం కు మధ్య జరుగుతున్న ఎన్నికలు…అక్రమ కేసులు…కబ్జాలు భూ దందాలతో అరాచక ఖమ్మం గా మారింది…ఈ ఎన్నికలు చారిత్రక ఎన్నికలు…తెలంగాణ ఎన్నికలు దేశ ఎన్నికలకు ఓ మలుపు….రాహుల్ గాంధీ నాయకత్వం లో తెలంగాణ లో కాంగ్రెస్ జెండా ఎగరనుంది….
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు బుగ్గవాగు తో సాగు నీటి కష్టాలు లేకుండా చేయాలని నా లక్ష్యం…బినామీ కంపెనీ లతో పనులు పూర్తి అవ్వకుండా చేశారని మంత్రి అజయ్ పై ధ్వజమెత్తారు ..ఆరాచకం లేని ఖమ్మం కోసం ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని తుమ్మల పిలుపు ఇచ్చారు….ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్ గారు, పట్టణ అధ్యక్షులు జావిద్ గారు, సాదు రమేష్ రెడ్డి గారు, కమర్తపు మురళి గారితో పాటు రఘునాథపాలెం మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు….