సత్తుపల్లిలో సండ్రకు ప్రజల బ్రహ్మరథం …రోజురోజుకు పెరుగుతున్న మద్దతు…
నాల్గవసారి కూడా సత్తుపల్లి ప్రజలు దీవిస్తారని ధీమా
గత 15 సంవత్సరాలుగా సత్తుపల్లి ప్రజలతో మమేకమైన సండ్ర
ఎమ్మెల్యేగా 20 సంవత్సరాల అనుభవం
ప్రజల ఏ కష్టం వచ్చిన నేనున్నానని అభయం
సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా 108 కన్నా ముందే వాయివేగంతో ప్రత్యక్షం
సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య…..జగమెరిగిన బ్రాహ్మణుడు …నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆయనకు తిరుగులేని రికార్డు ఉంది..26 సంవత్సరాల అత్యంత చిన్న వయస్సులోనే సండ్ర వెంకటవీరయ్య పాలేరు ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు ….తర్వాత కాలంలో సిపిఎం నుంచి టీడీపీలో చేరారు ..పాలేరు జనరల్ నియోజకవర్గం కావడం అదే సందర్భంలో సత్తుపల్లి ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో టీడీపీ అధిష్టానం సత్తుపల్లి నుంచి అవకాశం రావడంతో 2009 నుంచి వరసగా 2009 2014 2018 ,లలో వరస విజయాలు తిరిగి ఈనెల 30 న జరగనున్న ఎన్నిలకల్లో నాల్గవసారి సత్తుపల్లి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు …ఈసారి అధికార బీఆర్ యస్ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందకు ఆయన సిద్ధమైయ్యారు .,నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిస్కారం కోసం కృషిచేసి సండ్ర అంటే పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు..నియోజకవర్గంలోని మేజర్ సమస్యలు మాత్రమే కాకుండా మైక్రోలెవల్ లో సమస్యలను తెలుసుకొని పరిష్కరించి ప్రజల అభిమానాన్ని చురగున్నారు … గత మూడు పర్యాయాలు ఆయన టీడీపీ అభ్యర్థిగా ఎన్నికకాగా ఈసారి అధికార బీఆర్ యస్ నుంచి కారు గుర్తు పై పోటీచేస్తున్నారు . అయినప్పటికీ ఆయన ప్రజాదరణ పెరిగిందనే అభిప్రాయాలే ఉన్నాయి …నియోజకవర్గంలోని ప్రజలకు ఏ సమస్య ఉన్న వాయివేగంతో ప్రత్యక్షం అవుతారనే పేరుంది…అందుకే ఇటీవల కల్లూరు ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ స్వయంగా ఆయన పని పద్దతులపై మాట్లాడుతూ ఎక్కడ సమస్య ఉన్న 108 కన్నా ముందుంటారని ప్రసంశించారు .. అందుకే ఆయనకు ప్రజల్లో క్రేజి ఉంది…

మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2018 లో టీడీపీ అభ్యర్థిగా గెలిచినా అనంతరం ఆయన బీఆర్ యస్ లో చేరారు …రాష్ట్రంలో తెలుగుదేశం బలహీనపడటం అధినేత చంద్రబాబు తెలంగాణ పార్టీని అంతగా పట్టించకపోవడంతో నియోజక అభివృధ్ధికోసం సండ్ర తప్పని పరిస్థితిల్లో పార్టీ మారడం ఆయనకు అనుకూలంగా మారింది..ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయాలనీ సండ్ర సీఎం కేసీఆర్ , కేటీఆర్ అండదండలతో 1000 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు …నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ఆయన ప్రతి అడుగు ఉండేదంటే అతిశేయక్తి కాదు …వేంకటేశ్వరస్వామి భక్తుడైన సండ్ర టీడీపీ హయాంలో బోర్డ్ సభ్యుడుగా స్వామి వారికీ సరిగా సేవలు అందిందేదుకు అనేక సూచనలు చేశారు ….బోర్డు సమావేశాల్లో కూడా అత్యంత చురుకుగా వ్యవరిస్తూ తనకంటూ ముద్ర వేసుకున్నారు …అంతే కాకుండా బోర్డు సభ్యుడిగా అత్యంత ఎక్కువమందిని తిరుమల స్వామి వారి దర్శనం కల్పించిన ఘనత కూడా ఆయనదే కావడం విశేషం …ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజలను దర్శనానికి పంపించి వారి బాగోగులు చూసుకొని వారి అభిమానానికి పాత్రుడైయ్యారు ….