Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

కందాల కన్నీరు పై ప్రజల్లో చర్చ …

కందాల కన్నీరు పై ప్రజల్లో చర్చ …
భావోద్యేగామా …సింపతికోసమా …
కందాల నిలుపుకుంటారా ..?
సహాయం చేసే వ్యక్తిగా పేరు
కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారేరనేది మైనస్

కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు ఎమ్మెల్యే …. ఈనెల 30 రాష్ట్ర శాసనసభకు బీఆర్ యస్ అభ్యర్థిగా పాలేరు నియోజకవర్గంలో పోటీచేస్తున్నారు … కొద్దిరోజుల క్రితం నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో తాను మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్యేగానికి గురైయి కన్నీటిపరవంతమైయ్యారు ….సమావేశానికి వచ్చిన నేతలు, పక్కనే ఉన్న ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సైతం ఒక్కసారిగా ఈదృశ్యాన్ని చూసి దిగ్బ్రాంతి చెందారు. ఏమి జరుగుంది …ఎందుకు కందాల కన్నీటి పరవంతమైయ్యారు అనేది అందరిలో కలవరానికి గురిచేసింది … కందాల ను ఊరడించే ప్రయత్నం ఎంపీ నామంతో సహా అక్కడ ఉన్న నేతలు చేశారు ..అప్పటికే ఆయన కండువా అడ్డు పెట్టుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు ..దీనిపై సమావేశంలో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొన్నది …ఆవెంటనే కందాల నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు మిన్నంటాయి…మీ వెంట మేమున్నాం అంటూ సభికులు అండగా నిలిచారు..దీనిపై నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాపితంగా చర్చకు దారీ తీసింది ..గుండె దైర్యంగా ఉండే కందాల అందరికి దైర్యం చెప్పే కందాల తానే కన్నీళ్లు పెట్టడం ఎన్నడూ చూడని బీఆర్ యస్ నేతల సైతం ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. కన్నీరు పెట్టింది సింపతికోసం పెట్టారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి … ఎన్నికల్లో తనకు ప్రతికూలంగా ఉందని అభిప్రాయపడుతున్నారా .. ? తనపై పోటీచేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బలమైన అభ్యర్థిగా భావిస్తున్నారా… .. అంతకు ముందు తుమ్మలనే ఎదుర్కొన్న కందాల పొంగులేటి విషయంలో ఎందుకు భయపడతారు అనేది మరో చర్చ ….మొత్తానికి కందాల పెట్టిన కన్నీరు ప్రజల్లో సానుభూతి పెంచిందని బీఆర్ యస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి…అయితే తమ అభ్యర్థిని ఎదుర్కోలేకనే ఆయన జిమ్మిక్కులు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.. ఇందులో ఏది నిజం …ఏది అబద్దం అనేది డిసెంబర్ 3 వ తేదీన జరిగే తేలనుంది ..

కందాల రాజకీయ అరంగేట్రం 2018 ఎన్నికల్లో జరిగింది..గత ఎన్నికల్లో కందాల మొదటిసారి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని రాజకీయ దురంధరుడు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పై అన్యుహం విజయం సాధించారు …2009 ,2014 లోను ఆయన కాంగ్రెస్ టికెట్ కోసం ఆశించారు… కానీ రామిరెడ్డి వెంటకటరెడ్డికి పాలేరు టికెట్ ఇ వ్వడంతో ఆయనకు అవకాశం లభించలేదు .. రామిరెడ్డి వెంటరెడ్డి మరణం తర్వాత ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ యస్ నుంచి తుమ్మల పోటీచేసి రామిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరిత పై ఘనవిజయం సాధించారు..తర్వాత రెండున్నర సంవత్సరాలకే జరిగిన సాధారణ ఎన్నికల్లో తుమ్మల అన్యుహంగా ఓడిపోయారు .. తుమ్మల ఓటమికి కారణాలను పక్కనపెడితే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కందాల 7 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు …ఒక సందర్భంలో ఆయన్ను అష్టదిగ్బంధనం చేసినప్పటికీ ప్రజల అండ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఉన్న బలం ఆయనమీద ప్రజల్లో ఉన్న ఆదరణ ఆయన్ను గెలిపించింది…కాంగ్రెస్ టికెట్ పై గెలిసిన కొద్దినెలకే కనీసం తనను గెలిపించిన వారికీ చెప్పకుండా పార్టీ మారడంపై విమర్శలు ఉన్నాయి…బీఆర్ యస్ లో చేరిన దగ్గర నుంచి నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు .చనిపోయిన వారి కుటుంబాలకు 10 వేల రూపాయల చొప్పున గత ఐదు సంవత్సరాలుగా అందజేసిన ఎమ్మెల్యేగా రాష్ట్ర చరిత్రలో నిలిచారు ..అందుకే ఆయనపై నియోజకవర్గంలో ఎక్కడ పెద్ద వ్యతిరేకత కనిపించడంలేదు …కానీ బీఆర్ యస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను తట్టుకొని కందాల విజయబావుటా వేగరవేస్తారా ..లేదా ..అనేది చూడాలి మరి … !

Related posts

మణుగూరులో స్వల్ప భూప్రకంపనలు

Ram Narayana

పాలేరు ఎమ్మెల్యే కందాల, పోలీసుల తీరుపై సీఎల్పీ నేత భట్టి ఫైర్ …

Drukpadam

ఎన్నికల తర్వాత సైకోలకోసం ఖమ్మంలో పిచ్చి ఆసుపత్రి ..మంత్రి పువ్వాడ హాట్ కామెంట్స్ !

Ram Narayana

Leave a Comment