Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

మమత మెడికల్ కాలేజ్ ప్రాపర్టీ టాక్స్ ఎగొట్టిన ప్రబుద్దుడు నీతులు చెపుతున్నాడు…పువ్వాడ అజయ్ పై ..తుమ్మల ధ్వజం

మమత మెడికల్ కాలేజ్ ప్రాపర్టీ టాక్స్ ఎగొట్టిన ప్రబుద్దుడు నీతులు చెపుతున్నాడు…పువ్వాడ అజయ్ పై ..తుమ్మల ధ్వజం
ప్రాపర్టీ టాక్స్ అంటే ప్రజల సొమ్ము గత ఇరవై ఏళ్లుగా ఛారిటీ పేరుతో పన్ను ఎగవేత
కాంగ్రెస్ అధికారం లోకి రాగానే మమత మెడికల్ కాలేజ్ ఎగొట్టిన కోట్లాది రూపాయల అస్తి పన్ను కట్టిస్తా

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల తన ప్రత్యర్థి బీఆర్ యస్ కు చెందిన పువ్వాడ అజయ్ అక్రమాలపై మరో సంచలన విషయం వెల్లడించారు …మమతా మెడికల్ కాలేజీ ప్రాపర్టీ టాక్స్ ఎగొట్టిన ప్రబుద్దుడు నీతులు చెపుతున్నారని అంటూ ధ్వజమెత్తారు ..ప్రాపర్టీ టాక్స్ అంటే ప్రజల సొమ్ము దాన్ని చారిటీ పేరుతో పన్ను కట్టకుండా అప్పనంగా కాజేస్తూ శ్రీరంగనీతులు వల్ల వేస్తున్నారని నిప్పులు చెరిగారు … చారిటీ అంటే ఉచితంగా సేవ చేయాలి …అదిజరుగుతుందా లేదా ప్రజలకు తెలుసు …నేను చెప్పాల్సిన పనిలేదు …ఖమ్మంను ఎన్నో ఏళ్లుగా తాము రక్షకులుగా ఉండి ప్రజలసొమ్మును కాపాడితే అప్పనంగా కాజేసేందుకు తిరిగి అధికారం కావాలని కోరుతున్నారు ..విజ్ఞులైన ప్రజలు ఆలోచన చేయాలనీ తుమ్మల కోరారు ..

బీ.అర్.ఎస్ అభ్యర్ధి మూడు రోజుల ముందు మ్యాజిక్ చేస్తా అంటున్నారు …ఏమిటి ఆయన మ్యాజిక్ …డబ్బుసంచులతో ఓటర్లకు పంచెదనుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుంది…అది ఎవరి సొమ్ము ప్రజల సొమ్ము …రఘునాథపాలెం గుట్టల మట్టి కోట్లాది రూపాయలకు అమ్ముకొని కాజేసిన సొమ్ము …గోదావరి ఇసుక అక్రమంగా ఖమ్మంకు తెచ్చి అమ్ముకుంటున్న సొమ్ము , పేదలు వేసుకున్న గుడిశలు తొలగించి , సాగర్ కాలువలు ఆక్రమించి డబ్బులతో ఓటర్లకు పంచడానికి రెడీ గా ఉన్నారు .. మీ డబ్బులే పంచితే తీసుకోండి కానీ ఓటి ఎవరికి వెయ్యాలో వారికే వెయ్యండి ..ప్రశాంత ఖమ్మం కోసం ,పోలిసుల వేధింపులు లేని ఖమ్మం కోసం… ,క్రమ అరెస్టులు లేని ఖమ్మం కోసం …అరాచక భూ కబ్జాలు లేని ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని తుమ్మల పిలుపు నిచ్చారు

జయనగర్ కాలనీ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల మాట్లాడుతూ
జయనగర్ ఆత్మీయ సమావేశం జయం గానే ఉంటోందన్నారు …
రేణుకా చౌదరి కార్పొరేటర్ ఎన్నిక ఇంచార్జ్ గా 35, ఏళ్ల క్రితం పనిచేశా
తులారాం ప్రాజెక్ట్ కట్టిన చరిత్ర కేంద్ర మంత్రి గా రేణుకా చౌదరి దే
ఖమ్మం లో మెడికల్ కాలేజ్ ఏర్పాటులో రేణుకా చౌదరి నాంది వేశారు
మెడికల్ కాలేజ్ ఆస్తి పన్ను ఎగొట్టారు…నాకు రేణుకా చౌదరి కి రాజకీయ భిక్ష పెట్టిన పూజ్యులు ఎన్టీఆర్ గారు….తల వంచను తల ఎత్తుకునే లా నా నలబై ఏళ్ల రాజకీయం…

ఈ కార్యక్రమంలో రేణుక చౌదరి మాట్లాడుతూ

ఈ ఎన్నికలు భవిష్యత్తు నిర్ణయించే చారిత్రక ఎన్నికలు…తుమ్మల గెలుపు ఓ భాద్యత…
స్వాతంత్రం వచ్చిన తరువాత గుండాల మండలం వెళ్ళే ప్రజాప్రతినిధులు లేరు….
ఎన్నో ఏళ్ల తరువాత గుండాల మండలం వెళితే తుమ్మల అభివృద్ధి ఎంటో తెలుస్తోంది…
ధరణి పేరుతో భూముల దోపిడీ చేశారు…పరీక్ష లు నిర్వహించలేని చేతగాని తనం ఈ ప్రభుత్వానిది…కేసీఅర్ అధికార మధం తో తూలుతున్నారు….ప్రజల మధ్య తిరగలేని పువ్వాడ ఓ మంత్రా…సీనియర్ సిటిజన్స్ ని వేదించే మంత్రి ఖమ్మం లో అవసరమా
ఓట్ హక్కు ప్రజల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం…కనకపు సింహాసనమున శునకం అంటూ పువ్వాడ పై సెటైర్స్…కుక్కలు కూడా సిగ్గు పడతా యేమో కొందరిని పోల్చితే
మోదీ కేసీఅర్ జగన్ ముగ్గురు కేడీ లే…ప్రజలు ఆలోచన చేయాలి

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ అమిత్జ్ బేగ్ గారు రైతు సంఘం నాయకులు నల్లమల్ల వెంకటేశ్వరరావు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధా కిషోర్, మలీదు వెంకటేశ్వర్లు,వీరభద్రం, జ్యోతిర్మయి గారితో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

Related posts

జుబ్లియంట్ మూడ్ లో భట్టి, పొంగులేటి ,తుమ్మల

Ram Narayana

న్యూస్ ఇన్ బ్రీఫ్ ……

Drukpadam

ప్రచారంలో దుమ్ము రేపుతున్న బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు…

Ram Narayana

Leave a Comment