Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన …ప్రసంగాలపై భట్టి ఫైర్ …బీఆర్ యస్ కు సింగిల్ డిజిట్ అంటూ కౌంటర్ ఎటాక్!

రాష్ట్రముఖ్యమంత్రి ,బీఆర్ యస్ అధినేత కేసీఆర్ మంగళవారం ఖమ్మం జిల్లా పర్యటనల్లో సీఎల్పీ నేత మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క పై తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు .. భట్టి సీఎం ,సీఎం అంటున్నారు .అసలు కాంగ్రెస్ వచ్చేది లేదు చచ్చేదిలేదు…భట్టి సీఎంనా అంటూ ఎద్దేవా చేశారు …పైగా కాంగ్రెస్ పార్టీలో అరడజను మంది సీఎం లు అంటూ హేళన చేస్తూ మాట్లాడారు ..మధిరలో భట్టి ని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు …దీనిపై భట్టి కూడా అదేస్థాయిలో సీఎం కేసీఆర్ ప్రసంగాలపై ఫైర్ అయ్యారు … సీఎం కేసీఆర్ బీఆర్ యస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారు …బీఆర్ యస్ కు సింగిల్ డిజిట్ కు మించి సీట్లు రావు … 10 సీట్ల కన్న తక్కువగానే వస్తాయని ఎదురుదాడి చేశారు …కాంగ్రెస్ లో ఎవరు సీఎం అనేది మెజార్టీ శాసనసభ్యుల అభిప్రాయం ప్రకారం నాయకుడు ఎంపిక జరుగుతుందని అంతేకాని వారిలాగా నియంత విధానాలు ఉండవని అన్నారు …నేను సీఎం అని ఎక్కడ చెప్పలేదు …మాకు నాయకుడు ఎంపికలో ఒక విధానం ఉంది …దాన్ని ఫాలో అవుతాం ..అంతేకాని ఇష్టం వచ్చినట్లు కుదరదని గుర్తుంచుకోవాలని అన్నారు … ఇక నా నియోజకవర్గంలో ప్రజలు తనపై ఎంతో నమ్మకం ఉంచి మూడు సార్లు గెలిపించారు ..తిరిగి భారీ మెజార్టీతో అంటే 40 నుంచి 50 వేల మెజార్టీతో గెలిపించబోతున్నారు …నేను నిత్యం నియోజకవర్గ ప్రజలకోసం పనిచేశా…వారిచ్చిన అధికారంతోనే శాసనసభలో ప్రజల సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాను ఇది గిట్టని కేసీఆర్ నన్ను ఓడిస్తానని అంటున్నారు … మధిర ప్రజల అండదండలు ఆదరణ ఉన్నంతకాలం ఎవరు ఓడించలేరని ఘాటుగా జవాబు ఇచ్చారు ..

రాయేదో రత్నమేదో ప్రజలకు తెలుసు. భట్టి విక్రమార్క రత్నం లాంటి మనిషి కాబట్టే మధిర ప్రజలు మూడుసార్లు గెలిపించారు. కేసీఆర్ అనే ఓ బండ రాయిని.. రత్నం అనుకుని పదేళ్లు నెత్తిన పెట్టుకున్న ప్రజలు బండకేసి బాధడానికి రెడీ అవుతున్నారని కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు …వంద మంది కేసీఆర్ లు వచ్చి మీటింగ్ పెట్టిన మధిరలో నన్ను ఏం చేయలేరు. మధిర ప్రజలను కొనలేరని గుర్తుంచుకోవాలని భట్టి హెచ్చరించారు ..
నువ్వు (కేసీఆర్) మీ కొడుకు మీ అల్లుడు నీ బిడ్డ ఎవరు వచ్చి ఎన్ని కుట్రలు చేసినా భట్టిని ఏం చేయలేరు…ఇప్పుడే కాదు.. గతంలోనూ నన్ను ఓడించాలని కేసీఆర్ ఇలాగే ప్రయత్నించారు.. కానీ సఫలం కాలేకపోయారు….రాష్ట్రానికి దశా దిశా నిర్దేశం చేసే వ్యక్తిని గెలిపించాలని మధిర ప్రజలు కోరుకుంటున్నారు…కాంగ్రెస్ పార్టీకి కేవలం 20 సీట్లే వస్తాయని కేసీఆర్ భావిస్తే.. కాకిలా ఎందుకు తిరుగుతున్నారు…..నన్ను గెలిపించండి.. నా అభ్యర్థిని గెలిపించండని కేసీఆర్ లెక్కకు మిక్కిలిగా సభలు పెడుతున్నారు….తానే గజ్వేల్లో గెలవలేనని కామారెడ్డి వెళ్లిన కేసీఆర్.. కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పడం హస్యాస్పదం.
కేసీఆరుకే దిక్కులేదు.. కేసీఆర్ పెట్టిన అభ్యర్థి మధిరలో ఏం గెలుస్తారు..?రాష్ట్రానికి దశ దిశా నిర్దేశించే వాళ్లు మధిర నుంచి ఎన్నికవ్వాలని మా ప్రజలు కోరుకుంటున్నారు…కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలకు పైగా విజయం సాధించబోతున్నది…తెలంగాణ సీఎం ఎవరో మా అధిష్టానం నిర్ణయిస్తుంది….ఇందిరమ్మ రాజ్యం అంటే అభివృద్ధి సంక్షేమం, సంస్కరణ తీసుకొచ్చి భూములు పంచడం హరిత విప్లవం శ్వేత విప్లవం నీలి విప్లవంతో దేశాన్ని అభివృద్ధి చేశారు
దేశంలో ఆర్థిక అసమానతలు తొలగించడానికి ఇందిరమ్మ రాజ్యంలోనే 20 సూత్రాలు తెచ్చారు…ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇండ్లు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఉపాధి హామీ పని పింఛన్లు బ్యాంకుల జాతీయకరణ మిశ్రమాధిక విధానాలు బహుళార్థక సాధక ప్రాజెక్టులు ఇలా అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి…సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం…బాంచన్ దొర అని వారిని బానిసలనుంచి విముక్తి చేసి నిటారుగా నిలబెట్టింది ఇందిరమ్మ రాజ్యం…ఇందిరమ్మ రాజ్యం వద్దని ఫ్యూడలిస్టుల రాజ్యంలోకి తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నావా కేసీఆర్?ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు …

సీఎంగా ఉండి కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితం అయ్యారు….సీఎల్పీ నేతగా నా నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తూనే రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాను….దళిత బంధు అమలు విషయంలో కేసీఆర్ నన్ను ఆహ్వానించింది నిజం కాదా..?దళిత బంధు అమలు విషయంలో నేను సూచనలు చేసింది నిజం కాదా..?*దళిత బంధును కేసీఆర్ ఓట్ల కోణంలో మాత్రమే చూశారు…భట్టి విక్రమార్కకు భయపడే ముఖ్యమంత్రి కేసీఆర్ మధిరకు దళిత బంధు ఇచ్చారు….ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను లెక్కలతో సహా అసెంబ్లీలో నిలదీయడంతో దళిత బంధు తెచ్చారు…విద్యుత్ ఉత్పత్తికి కేసీఆర్ చేసిందేమిటీ..?గత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మాణం చేసిన పౌర ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు కరెంటు కొరత లేదు…తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో శ్రీమతి సోనియా గాంధీ రాష్ట్రానికి నాలుగు శాతం ఎక్కువగా కరెంటు కేటాయించింది…కెసిఆర్ ప్రారంభించిన భద్రాద్రి యాదాద్రి ఇప్పటికీ ప్రొడక్షన్ ప్రారంభం కాలేదు…మరి కరెంటు ఎక్కడినుంచి తెచ్చి కేసీఆర్ ఇస్తున్నాడు. తానే కరెంటు ఇస్తున్నానని గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉంది.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సీఎం కేసీఆర్ అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడం సరికాదు…
సంపదను సృష్టించి పేదలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం….సభలోనే ధరణి గురించి మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు….ఇంకా ధరణి గురించి కేసీఆర్ ఏం చర్చిస్తారు..?నేను మూడు సార్లు గెలిచినా మధిర సమస్యల పరిష్కారానికి కృషి చేశాను…కేసీఆర్ రాష్ట్ర సంపదను దోచుకున్నారు.. నేను మధిర సంపదను దోచుకోలేదు.. అభివృద్ధి చేశాను…తెలంగాణ రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబ సభ్యులు దోపిడీ చేసేస్తున్నారు…కేసీఆర్ లాంటి వాడు 50 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చుంటే గుండు సూది కూడా ఉత్పత్తి చేయలేకపోయేవాళ్లం.

పదేళ్లల్లో కేసీఆర్ అప్పులు తప్ప చేసిందేముంది..?ఏమైనా అంటే కాళేశ్వరం అంటారు.. కాళేశ్వరం ఏమైందో చూశారుగా..?కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఇన్నాళ్లూ ఏం చేస్తున్నారు..? గాడిదలు కాస్తున్నారా..?కేసీఆరుకు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని కేంద్ర హోం మంత్రే చెప్పారు.. ఎందుకు చర్యలు తీసుకోలేదు ప్రశ్నించారు ….

Chief Minister and BRS chief KCR on Tuesday attacked CLP leader Madhira Congress candidate Bhatti Vikramarka during his visit to Khammam district. They spoke tauntingly..They called for defeating Bhatti in Madhira…On this Bhatti also got fired up on CM KCR’s speeches…CM KCR is daydreaming that BRS party will come to power…BRS won’t get more than single digit seats. … They counterattacked that they will get less than 10 seats … Who is the CM in the Congress? He said that the leader is chosen according to the opinion of the majority of the legislators and there are no dictatorial policies like them … I did not say that I am the CM … We have a policy in the selection of the leader.. .We will follow it..But he said that he should remember that he cannot do as he likes…and people in my constituency have trusted him three times. KCR, who did not get this, says that he will defeat me because he has exposed the government’s failures on people’s issues in the legislative assembly with power.

People know whether it is written or not. Madhira people won thrice because Bhatti Vikramarka is a man like Ratnam. KCR is a rock called a gem. People who have been waiting for ten years are ready to suffer because of KCR. Bhatti warned that Madhira cannot buy people.
You (KCR), your son, your son-in-law, your child, no matter how many conspiracies you do, can’t do anything to Bhatti. …if KCR thinks that the Congress party will get only 20 seats..why are they circling like a crow…..let me win….KCR is holding a lot of meetings to prevent my candidate from winning….KCR who went to Kamareddy to say that Congress will lose is ridiculous.
KCR has no direction.. What will the candidate nominated by KCR win in Madhira..? Our people want those who set the direction of the state to be elected from Madhira… Congress party is going to win more than 75 seats… Our leadership will decide who will be the CM of Telangana…. Indiramma Rajyam. The country was developed by bringing development welfare, reform and distribution of lands, green revolution, white revolution, blue revolution.
20 principles were brought by Indiramma Rajya to eliminate economic inequalities in the country…Indiramma Rajya means housing fee reimbursement, health, employment guarantee, work pensions, nationalization of banks, mixed policies, multipurpose projects. It was Indiramma’s kingdom that freed them from the slaves and made them upright… Do you want to take Indiramma’s kingdom to the kingdom of feudalists? Khabardar gave a warning…

Being the CM, KCR confined himself to the farm house….As a CLP leader, I tried to solve the problems of the state while solving the problems in my constituency….Is it true that KCR invited me regarding the implementation of Dalit Bandhu? *Dalit Bandhu was seen only in terms of KCR’s votes… Chief Minister KCR Madhira, who was afraid of Bhatti Vikramarka, gave Dalit Bandhu to Madira. Now there is no shortage of electricity due to the civic projects done…During the division of Telangana state, Mrs. Sonia Gandhi allocated four percent more electricity to the state…Bhadradri Yadadri started by KCR has still not started production…and where is KCR getting electricity from? It is ironic that he is boasting that he is providing electricity.

It is not right for CM KCR to lie at the level of Chief Minister…
Indiramma’s kingdom is to create wealth and distribute it to the poor….Sabha

Related posts

బీజేపీ ,బీఆర్ యస్ కుమ్మక్కు రాజకీయాలు…నాపై ఐటీ దాడులుజరిపే అవకాశం ….

Ram Narayana

ఎవరి బెదిరింపులకు భయపడేది లేదు: మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా , ఇల్లందు బీఆర్ యస్ అభ్యర్థుల మార్పు ….?

Ram Narayana

Leave a Comment