Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఆనందయ్య మందుకు పచ్చజెండా ఊపిన ఏపీ ప్రభుత్వం…హైకోర్టు సైతం ఓకే…

ఆనందయ్య మందుకు పచ్చజెండా ఊపిన ఏపీ ప్రభుత్వం…హైకోర్టు సైతం ఓకే
-ఏపీలో చర్చనీయాంశంగా ఆనందయ్య కరోనా మందు
-సీసీఏఆర్ఎస్ అధ్యయనం
-ప్రభుత్వానికి నివేదిక సమర్పణ
-నివేదిక పరిశీలించిన పిదప అనుమతి
-ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
-చుక్కల మందుపై గురువారం లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
-తదుపరి విచారణ గురువారానికి వాయిదా

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆనందయ్య మందు ఎంతోమందిలో ఆశలు కల్పించిందనడంలో సందేహంలేదు. అయితే, ఈ మందుపై శాస్త్రీయ అధ్యయనం అవసరమంటూ పంపిణీని కొన్నిరోజుల పాటు నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం… ఎట్టకేలకు అనుమతి మంజూరు చేసింది. సీసీఏఆర్ఎస్ (జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ) కమిటీ ఇచ్చిన నివేదికను పూర్తిగా పరిశీలించిన ప్రభుత్వం ఆనందయ్య మందు పంపిణీకి అభ్యంతరం లేదని తేల్చి చెప్పింది.

అయితే, ఆనందయ్య కుటుంబీకులు కంట్లో వేస్తున్న మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై కమిటీ నుంచి నివేదిక రావాల్సి ఉందని, నివేదిక పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. దీనికి మరికొంత సమయం పడుతుందని వెల్లడించింది. కాగా, సీసీఏఆర్ఎస్ నివేదికలో ఆసక్తికర అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గుతుందని చెప్పలేమని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ మందు వాడుతున్నంత మాత్రాన ఇతర మందులు ఆపొద్దని ప్రభుత్వం పేర్కొంది. అటు, ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ ఈ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడడం తెలిసిందే.

 

ఆనందయ్య మందు పంపిణీకి హైకోర్టు ఓకే

 

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఔషధం పంపిణీకి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఏపీ హైకోర్టు కూడా ఆనందయ్య మందుకు అనుమతి ఇచ్చింది. ఆనందయ్య ఔషధం పంపిణీపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది.

మధ్యాహ్నం 1 గంట సమయానికి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నం 3 గంటల సమయానికి వాయిదా వేసింది. కోర్టులో విచారణ పునఃప్రారంభమైన అనంతరం, ఆనందయ్య మందును పంపిణీ చేయవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, కంట్లో వేసే చుక్కల మందుపై గురువారం లోగా పూర్తి నివేదిక అందజేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Related posts

హమ్మయ్య తెలంగాణ ప్రజలకు శుభవార్త -లాక్ డౌన్ ఎత్తి వేత…

Drukpadam

ఒమిక్రాన్ దెబ్బకు 11,500 విమానాల రద్దు!

Drukpadam

అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో సభలు, రోడ్ షోలు మరో వారం పాటు నిషేధం!

Drukpadam

Leave a Comment