Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

పువ్వాడ అజయ్‌ ఒక దుష్టుడు, దుర్మార్గుడు: రేణుకా చౌదరి

  • ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన బలపాల గ్రామస్తులు
  • హాజరైన తుమ్మల నాగేశ్వరరావు, రేణుకా చౌదరి
  • ఓటుతో అజయ్ ను తరిమికొట్టాలన్న రేణుక

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బీఆర్ఎస్ కు పోటీగా కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈరోజు కురవి మండలం బలపాల గ్రామస్తులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మాజీ ఎంపీ రేణుకా చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ మంత్రి పువ్వాడ అజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

పువ్వాడ అజయ్ దుష్టుడు, దుర్మార్గుడు అంటూ రేణుక విరుచుకుపడ్డారు. ఆయన డీఎన్ఏలోనే లోపం ఉందని విమర్శించారు. ఎవరూ కూడా నిస్సహాయంగా ఉండొద్దని… ఓటు అనే ఆయుధంతో అజయ్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మన భవిష్యత్తు కోసం తుమ్మల నాగేశ్వరరావును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ఎన్నికలు చరిత్రలో మిగిలిపోతాయని అన్నారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.

Related posts

ముఖ్యమంత్రి ప్రకటన రేపటికి వాయిదా… డీకే శివకుమార్‌కి ఢిల్లీకి పిలుపు

Ram Narayana

నేను పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ కు ప్రాధాన్యత పెరిగింది: రేవంత్ రెడ్డి

Ram Narayana

వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో ఈజీ విక్టరీ.. జగ్గారెడ్డి జోస్యం

Ram Narayana

Leave a Comment