Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఉపేందర్ రెడ్డి కన్నీళ్లకు కరిగితే ఐదు సంత్సరాలు కన్నీళ్లు పెట్టాల్సిందే…పొంగులేటి

ఉపేందర్ రెడ్డి కన్నీళ్లకు కరిగితే ఐదు సంత్సరాలు కన్నీళ్లు పెట్టాల్సిందే…పొంగులేటి
ప్రజల దైర్యంతోఎన్ కేసీఆర్ తప్పుడు విధానాలను ఎండగడుతున్నా
దొరచేతిలో బందీ అయినా తెలంగాణకు విముక్తి కలిగించాలి
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం

పాలేరు బీఆర్ యస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి కన్నీళ్లకు కరిగితే ఐదు సంవత్సరాలు కన్నీళ్లు పెట్టుకోవాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఇటీవల ఒక సమావేశంలో ఓడిపోతామనే ఉద్దేశంతో సానుభూతి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయుముసలి కన్నీళ్లు మాత్రమేనని ప్రజలు అనుకుంటున్నారన్నారు … గురువారం పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలలో ఆయన పాల్గొని ప్రసంగించారు … బీఆర్ యస్ పాలనలో ఏవర్గం బాగుపడలేదని ,ఉద్యోగులు ,నిరుద్యోగులు , యువకులు ,మహిళలు ,కార్మికులు ,కర్షకులు , రైతు కూలీలు , బీసీలు ,ఎస్సీలు ,ఎస్టీలు ,మైనార్టీలు ఇలా అన్ని తరగతులను మోసం చేసిన ఘనుడు కేసీఆర్ విమర్శించారు .. రేపు 30 తేదీన జరగనున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ది చెప్పబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు .కేసీఆర్ పాలనకు విసుగు చెందిన ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు ..9 వ తేదీన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని జోష్యం చెప్పారు .. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి ప్రజారంజక ప్రభుత్వాన్ని అందిస్తామని అన్నారు ..మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ,2500 రూపాయల నెలకు అందించడం జరుగుతుందని అన్నారు . నిరుద్యోగులకు ఉద్యోగాల ఇచ్చేందుకు తగిన కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని

ఎక్కడకు వెళ్లిన ప్రజలు దీవిస్తున్నారని చేతిగుర్తుకు ఓటి వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారని …సాధించుకున్న తెలంగాణ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఓ దొర చేతిలో బందీ అయింది.. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, దొర చేతికి అప్పగించడానికి కాదు … సామాన్య ప్రజానీకానికి మంచి చేయడానికి.. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ దొర ఫామ్ హౌస్ నుంచి బయటికి వస్తాడు.. ఎన్నికలు అయిపోతే సామాన్య ప్రజానీకం కష్టాలల్లో ఏనాడు పాలుపంచుకోడు.. ఎన్నికలప్పుడు మాత్రమే ఇంద్రలోకం చంద్రలోకం చూపించి మాయ మాటలు చెబుతాడు… ఈ దొర.. ఈ దొర మాయమాటలకు మోసపోతే మళ్ళీ మనం గోస పాలవుతాం.. ఇందిరమ్మ రాజ్యంతో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజారాజ్యాన్ని తెచ్చుకుందాం.. నిత్యం మీతోనే ఉంటా మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటా…ఈనెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి మీ శీనన్న ని అత్యధిక మెజార్టీతో గెలిపించండి..
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇప్పటివరకు ప్రజల సొమ్ము దోచుకొని దాచుకున్నాడు… దోచుకొని దాచుకున్న సొమ్ముతో అక్కడ రేవంత్ రెడ్డిని ఇక్కడ నన్ను ఓడించడానికి కోట్లు ఖర్చు చేస్తున్నాడు.. మీరు ఉన్నారనే ధైర్యంతోనే కేసీఆర్ ని ఎండగడుతున్న.. మీ దీవెనలతో రేపు అసెంబ్లీలో తప్పకుండా అధికారపక్షంలో నేను, ప్రతిపక్షంలో కేసీఆర్ ఉంటాడు.. అసెంబ్లీలో ప్రతిరోజు చేసిన తప్పులను నిగ్గదీసే కార్యక్రమం ఉంటుందన్నారు …వర్షంలోనూ పొంగులేటి సభలకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం విశేషం….

Related posts

నన్ను సాదుకుంటారా.. సంపుకుంటారా మీఇష్టం .. మంత్రి పువ్వాడ అజయ్

Ram Narayana

సకాలంలో గుర్తిస్తే క్యాన్సర్‌తో ప్రమాదం లేదు…

Ram Narayana

ఎన్టీఆర్ కు భారత రత్నఇవ్వాలనే ఉద్యమానికి మంత్రి పొంగులేటి మద్దతు…

Ram Narayana

Leave a Comment