Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలంటూ ఎంపీ వద్దిరాజు దంపతుల పూజలు…

తెలంగాణ మాదిరిగానే యావత్ భారతం సుభిక్షంగా వర్థిల్లాలని కాంక్షిస్తూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ దంపతులు హోమగుండం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికలలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావాలని కోరుతూ కనకదుర్గాదేవిని వారు వేడుకున్నారు.ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలోని శ్రీరామలింగేశ్వర సమేత విజయశంకర బాలకనకదుర్గాదేవి శివపంచాయతన క్షేత్రాన్ని ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు వారి కుమారుడు నిఖిల్ చంద్ర కోడలు అనీలతో కలిసి శుక్రవారం సందర్శించారు.క్షేత్రంలో రాజగోపుర శిఖర ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవం ఈనెల 20వ తేదీ నుంచి 24 వరకు వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ఘనంగా జరిగింది.పుణ్య దంపతులు ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ,నిఖల్ చంద్ర-అనీల తమ గాయత్రి గ్రానైట్స్ కంపెనీ పక్షాన శృంగేరి వారి ఆశీస్సులతో రాజగోపుర శిఖర ప్రతిష్ఠ చేయించారు.ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో రవిచంద్ర-విజయలక్మీ, నిఖల్ చంద్ర-అనీల భక్తిప్రపత్తులతో పాల్గొన్నారు.మాతృశ్రీ యోగినీమాత నేతృత్వంలో రాజగోపుర శిఖర ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది.రవిచంద్ర-విజయలక్మీ, నిఖిల్ చంద్ర-అనీలకు వేద పండితులు ఆశీర్వచనాలు పలికి అమ్మ వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు,పూజారులను రవిచంద్ర శాలువాలతో సత్కరించారు.

Related posts

ఏపీ, తెలంగాణలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన సోనూసూద్!

Ram Narayana

తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు: కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

Ram Narayana

శంషాబాద్ నుంచి రైలులో విశాఖకు నాలుగు గంటల్లోనే.. ఖరారైన కొత్త రైల్వే మార్గం…

Ram Narayana

Leave a Comment