Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

చివరి నాలుగు రోజుల సమరం …జాతీయనాయకుల రాకతో ఉక్కిరి బిక్కిరి…

చివరి నాలుగు రోజుల సమరం …జాతీయనాయకుల రాకతో ఉక్కిరి బిక్కిరి…
తెలంగాణ రాజకీయ కేంద్రీకరణ…ఈనెల 30 ఎన్నికలు ..28 సాయంత్రం ప్రచారం ముగుంపు
హోరెత్తుతున్న ప్రచారం …నిద్రాహారాలుమాని అభ్యర్థుల పరుగులు
ఓటర్లను ప్రలోభ పెట్టె చర్యలు ముమ్మరం
ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్న స్వతంత్రులు

తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఈనెల 30 ఎన్నికల నిర్వహణకు ఒక పక్క అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తుండగా మరో పక్క రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివర ప్రయత్నాలు ప్రారంభించాయి…బీఆర్ యస్ ,కాంగ్రెస్ ,బీజేపీ ఎవరికీ వారే గెలుపు ధీమాతో ఉన్నాయి…అభ్యర్థులు నిద్రాహారాలుమాని ప్రచారానికి పరుగులు పెడుతున్నారు ..

ఈనెల 28 సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుండగా ఎన్నికలు జరుగుతున్న మిగతా రాష్ట్రాల్లో ప్రచారం ముగియడం కొన్ని చోట్ల పోలింగ్ ముగియడంతో తెలంగాణ పై రాజకీయ వాతారణం కేంద్రీకృతమైంది …అన్ని పార్టీల జాతీయ నాయకులూ శుక్రవారం నుంచి రాష్ట్రానికి క్యూకట్టారు … బీజేపీ తరుపున ప్రధాని మోడీ చివరి మూడు రోజులు ప్రచారంలో పాల్గొననుండగా , కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా , రాజ్ నాథ్ సింగ్ , జెపి నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు విసుగు విరామం లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు …కాంగ్రెస్ నుంచి ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ,ఆపార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ , జైరాం రమేష్ , కర్ణాటక సీఎం సిద్దరామయ్య , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ , అధికార ప్రతినిదులు , వివిధ సంఘాల నాయకులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు …అధికార బీఆర్ యస్ నుంచి సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చిరవదశకు చేరుకోగా , పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ , మంత్రి హరీష్ రావు , ఎమ్మెల్సీ కవిత బీఆర్ యస్ అభ్యర్థుల తరుపున జరుపుతున్న ప్రచారం పతాక స్థాయికి చేరింది…ఎంఐఎం తరుపున అసదుద్దీన్ ఒవైసి , అక్బరుద్దీన్ ఒవైసి ఆపార్టీ తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు .. సిపిఐ కాంగ్రెస్ లో పొత్తులో భాగంగా పోటీచేస్తున్న కొత్తగూడెం లో ఆపార్టీ ప్రధాన కార్యదర్శి డి .రాజా, జాతీయకార్యదర్శి డాక్టర్ కె నారాయణ ప్రచారంలో పాల్గొన్నారు .. సిపిఎం రాష్ట్రంలో 19 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీచేస్తుండగా ,జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి , ఆపార్టీ అగ్రనాయకులు మాణిక్ సర్కార్ , బృంద కారత్ , బీవీ రాఘవులు లాంటి వారితో ప్రచారం హోరెత్తిస్తున్నారు …బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి ఆపార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహించారు …కొన్ని నియోజకవర్గాల్లో స్వంతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీనిస్తూ ప్రధాన పార్టీల అభ్యర్థులకు చెమటలు పుట్టిస్తున్నారు …

మొత్తం రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకు ఒకేసారి నవంబర్ 30 ఎన్నికలు జరగనున్నాయి…2290 అభ్యర్థులు పోటీలో ఉన్నారు …3 .17 కోట్ల మందికి పైగా ఓట్లర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది…ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఓట్లర్లు స్లిప్పలను పంపిణి చేసింది….

Related posts

కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నావ్? అని అడుగుతున్నారు: రేవంత్ రెడ్డి

Ram Narayana

కేసీఆర్ తీరుపై తుమ్మల ఫైర్

Ram Narayana

కడియం శ్రీహరిని పార్టీలోకి ఎలా తీసుకుంటావ్?: రేవంత్ రెడ్డిపై మంద కృష్ణ మాదిగ మండిపాటు

Ram Narayana

Leave a Comment