Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాలి…ప్రియాంక గాంధీ

అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాలి…ప్రియాంక గాంధీ
కేసిఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకా గాంధీ మండిపాటు
మార్పు కావాలి .. కాంగ్రెస్ రావాలని పిలుపు
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తాం
రోడ్డు షో లో పోటెత్తిన పార్టీ శ్రేణులు
ఖమ్మం, పాలేరు లో ప్రియాంక ప్రచారం
కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ జెండాల రెపరెపలు

కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం ఖమ్మం జిల్లాలో జోష్ నింపింది. ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మధిర అభ్యర్థి భట్టి విక్రమార్క, సతుపల్లి అభ్యర్థి రాగమయి విజయాన్ని కాంక్షిస్తూ ప్రియాంక గాంధీ ఇక్కడకు వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు షో ప్రారంభమైంది. అడుగడుగున జన నీరాజనాలు పలికారు. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ జెండాల రెపరెపలడాయి. ర్యాలీ లో పార్టీ పాటలకు నృత్యాలు హోరెత్తాయి. ఖమ్మం నగరంలో ఏదైన కూడలి లో ఆమె ప్రసంగం ఉంటుందని భావించినప్పటికీ అది జరగలేదు. ప్రచార వాహనం మీదే గిరిజన మహిళలతో కలిసి ప్రియంకా నృత్యాలు చేశారు. చప్పట్లు కొట్టి ఉత్సహాన్ని నింపారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు ముందే ఆమె రోడ్డు షో ముగించి ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో ఎవరికి ఉద్యోగాలు రాలేదని సీఎం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ను ఇంటికి పంపించాలని , బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం మహిళలు , యువత, రైతులు ఇతర వర్గాల శ్రమతో వచ్చిందన్నారు. వచ్చిన తెలంగాణ ఈ పదేళ్ల కేసీఆర్ పాలన లో భ్రష్టు పట్టిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అక్కడ ఉద్యాగాలు కల్పించి, ప్రభుత్వ సంపద ప్రజలు కు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించాలని ప్రియాంక విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో పార్టీ అభ్యర్థులు తుమ్మల నాగేశ్వర రావు(ఖమ్మం), పొంగులేటి శ్రీనివాస రెడ్డి(పాలేరు), భట్టి విక్రమార్క(మధిర) ఉన్నారు.

Related posts

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

Ram Narayana

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం మా పార్టీ పని చేస్తుంది: సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి

Ram Narayana

బీఆర్ఎస్ పాలన అంతా అస్తవ్యస్తమే: మల్లు భట్టి విక్రమార్క

Ram Narayana

Leave a Comment