Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ప్రజాసంక్షేమం కోసం కాంగ్రెస్ ను గెలిపించండి …సీడబ్ల్యూసీ సభ్యులు రమేష్ చెన్నితల

ప్రజాసంక్షేమం కోసం కాంగ్రెస్ ను గెలిపించండి …సీడబ్ల్యూసీ సభ్యులు రమేష్ చెన్నితల
కేసీఆర్ దంతా పచ్చి మోసం …అవినీతి సర్కార్ కు బుద్ది చెప్పండి

ప్రజాసంక్షేమ పాలన కోసం కాంగ్రెస్ ను గెలిపించాలని సీడబ్ల్యూసీ సభ్యులు రమేష్ చెన్నితల అన్నారు …తెలంగాణాలో జారుతున్న ఎన్నికల్లో ఏఐసీసీ తరుపున ఎన్నికల ముఖ్యపరిశీలకులుగా వచ్చిన చెన్నితల ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా ఋణం తీర్చుకునేందుకు ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం ద్వారానే అదినేరవేరుతుందని అన్నారు …కేసీఆర్ ను నమ్మి ప్రజలు అధికారం ఇస్తే కుటుంబపాలన సాగిస్తూ ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారని …కేసీఆర్ దంతా పచ్చి మోసం …అవినీతి సర్కార్ కు బుద్ది చెప్పండి పిలుపు నిచ్చారు .. గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ యస్ ప్రభుత్వం మాయ మాటలతో అంకెల గారడీలతో తెలంగాణ లోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు …ప్రజారంజకపాలన అందించక పోగా బడుగు బలహీన వర్గాల ప్రజలను ఓటు బ్యాంకుగా చూస్తూ వారి ఓట్లతో రాజరిక పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు … కాంగ్రెస్ పార్టీ కర్నాటక ఎలక్షన్స్ లో ఐదు గ్యారంటీలను ప్రకటించి ప్రభుత్వం ఏర్పడిన మొదటి కేబినెట్ సమావేశంలో అమోదించి ప్రజలకు అందిస్తున్నారని కానీ గోబెల్స్ బ్రదర్స్ అక్కడ పథకాలు అమలు కావడంలేదని ప్రచారం చేస్తున్నారని వారి బుద్ది వచ్చేలా తెలంగాణ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు . ఇప్పటి వరకు కర్నాటక లో కోటి మంది మహిళలు ఆర్టీసీ బస్ లలో ఉచిత ప్రయాణం చేశారని , అదే విధంగా తెలంగాణా లో ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అన్నారు . తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేరస్తుందన్నారు . అందువల్ల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులను అధిక మెజారిటతో గెలిపించాలని చెన్నితల కోరారు ..

మీడియా సమావేశంలో ఏఐసీసీ మీడియా ఇంఛార్జి బీఆర్ అనిల్ కుమార్,జిల్లా కాంగ్రెస్ కమిటి అద్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ కమిటి అద్యక్షులు మహ్మద్ జావేద్, మాజి పి సి సి సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ రషీద్, ఏలూరి రవికుమార్ తదితర పాల్గొన్నారు.

Related posts

ఎల్లుండి తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా… మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బిజీ బిజీ

Ram Narayana

ముస్లింల మద్దతు ఎప్పటికీ కాంగ్రెస్ కే వుంటుంది: తుమ్మల నాగేశ్వరరావు

Ram Narayana

ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ కోసం మేం ఎప్పటి నుంచి సన్నద్ధమవుతున్నామో తెలుసా..?: రోహిత్ శర్మ

Ram Narayana

Leave a Comment