Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

సత్తుపల్లి ,వైరా ,మధిర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు భట్టి ,తుమ్మల,పొంగులేటి ప్రచారం

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం జిల్లాకు చెందిన అగ్రనేతలు కలిసి కట్టుగా సత్తుపల్లి , వైరా , మధిర నియోజకవర్గాల్లో పర్యటించడం కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరిచింది..సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీమంత్రి ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు లు ఆదివారం సత్తుపల్లి నుంచి వైరా , మధిర వరకు నిర్వహించిన ర్యాలీలో పెద్ద సంఖ్యలు యువకులు పాల్గొన్నారు …సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో ప్రారంభమైన ఈర్యాలీని భట్టి ప్రారంభించారు …సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాఘమయిని గెలిపించాలని భట్టి విక్రమార్క, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచారం చేశారు … సత్తుపల్లి నియోజకవర్గం ఏన్కూరు మండలం మర్లపాడు గ్రామంలో కార్నర్ మీటింగ్ కు హాజరైన వేలాది జనం ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో పాల్గొని బీఆర్ యస్ పాలపై ,కేసీఆర్ అవినీతిపై , ధ్వజమెత్తారు ..

సిఎల్పీ నేత భట్టి …

ప్రజల సంపదను 10 సంవత్సరాలుగా పందికొక్కుల్లా తిన్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు ..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు రుణమాఫీ ఇవ్వదనడానికి కేసీఆర్, కేటీఆర్ కు బుద్ధి ఉండాలని అన్నారు …ఐదు సంవత్సరాలుగా రుణమాఫీ అమలు చేయని రైతు వ్యతిరేకి కేసీఆర్ కదా ..? అని ప్రశ్నించారు …ఇన్ని రోజులు లేనిది కేవలం ఎన్నికల కోసమే కెసిఆర్ రైతుబంధు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు …సత్తుపల్లి నియోజకవర్గానికి 10 సంవత్సరాలలో ఒక్క అభివృద్ధి పని చేయలేని బిఆర్ఎస్ ప్రభుత్వం అవసరమా అని అన్నారు ….కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి జరిగిన విషయాన్నీ గుర్తుచేశారు …బిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఒక్కరికైనా పింఛన్ ఇచ్చారా? ఇండ్లు ఇచ్చారా? రేషన్ కార్డు ఇచ్చారా? కొలువులు ఇచ్చారా? చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేశారా? అంటూ కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు …

కాంగ్రెస్ హయాంలోనే సత్తుపల్లి నియోజకవర్గం లో కాలువలు తవ్వించారు,. రోడ్లు వేశారు, ఇల్లు కట్టించారు, ఇంటి స్థలాలు ఇచ్చారు, రేషన్ కార్డు ఇచ్చారు, ఆరోగ్యశ్రీ ఇచ్చారు, బిఆర్ఎస్ మరి ఏం చేసినట్టు?…ఏకకాలంలో రుణమాఫీ చేయని కేసీఆర్ సర్కార్ ఎన్నికల కోసం రైతుబంధు ఇవ్వడానికి ఈసీ నుంచి అనుమతి తెచ్చుకుంది…ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని అన్నారు …కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి 15వేల రూపాయలు రైతుబంధు ఇస్తాం…కెసిఆర్ మాదిరిగా కాంగ్రెస్ గాలి కబుర్లు చెప్పదు. గ్యారెంటీగా ఇచ్చిన హామీలను అమలు చేస్తుందన్నారు …
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించడానికి కేసీఆర్, కేటీఆర్ కు బుద్ధుండాలి…ప్రజల సంపదను ప్రజలకు పంచితే ఇవే కాదు, ఇంకా మరిన్ని పథకాలు ఇవ్వొచ్చున్నారు

రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలన్నారు …ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు…డిసెంబర్ 3న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది….సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట…ప్రజా సేవకురాలు డాక్టర్ రాగమయిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల విజ్ఞప్తి చేశారు ..నోట్ల కట్టల సంచులతో రాజకీయం చేస్తూ ఎన్నికల్లో గెలుస్తామని విర్రవీగుతున్న బిఆర్ఎస్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపు నిచ్చారు .

పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు ..వైరా కాంగ్రెస్ అభ్యర్థి రాందాస్ నాయకులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు…వైరా పట్టణంలోని పరుచూరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కాంగ్రెస్ సిపిఐ తెలుగుదేశం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు …కాంగ్రెస్ ను ముట్టుకున్న కరెంటును పట్టుకున్న మాడిపోతావు కేసీఆర్….కాంగ్రెస్ ఉంటేనే కరెంటు వచ్చింది…ఉచిత కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ది, ఆ పేటెంట్ కాంగ్రెస్ కు ఉంది…సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్టుగా ఉచిత కరెంటు తాను ఇస్తున్నానని కేసీఆర్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది…గాలి మాటలు అడ్డగోలుగా మాట్లాడటం మానుకో కేసీఆర్…కాంగ్రెస్ సునామీలో బిఆర్ఎస్ కొట్టుకుపోతుంది…బి ఆర్ ఎస్ డబ్బు రాజకీయాలకు నోట్ల కట్టల సంచులకు వైరా ప్రజలు లొంగరు…డబ్బు సంచులతో ఓటర్లను కొనాలని చూస్తున్న కేసీఆర్ను ఓడిద్దాం…రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు వైరాలఛ బిఆర్ఎస్ గెలిచింది లేదు…ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ గెలవదు గెలవనివ్వము…తెలంగాణలో కాంగ్రెస్ గాలీ సునామీల వస్తున్నది…అధికారంలోకి వచ్చిన 100 రోజులని ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తాం….కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు కరెంటు రాదని కేసీఆర్ పిచ్చి కూతలు కూస్తున్నాడు….
కెసిఆర్ అధికారంలోకి రాకముందే రైతులకు రుణమాఫీ రాయితీలు ఉచిత కరెంటు కాంగ్రెస్ ఇచ్చాం

Related posts

కలిసి నడుద్దాం బి.ఆర్.ఎస్ ను ఓడిద్దాం – సి.పి.ఐ పాలేరు నియోజకవర్గ సమావేశంలో పొంగులేటి…

Ram Narayana

పార్టీ మార్పు గురించి పువ్వాడ అజయ్ మాట్లాడటం హాస్యాస్పదం …కమర్తపు మురళి

Ram Narayana

స్పీడ్ పెంచిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి …మేము సైతం లో దూకుడు …

Drukpadam

Leave a Comment