రైతుబంధును ఆపింది ముమ్మాటికీ కాంగ్రెస్సే…ఎంపీ రవిచంద్ర
ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితి, సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్వామినాథన్ వంటి ప్రముఖులు ప్రశంసించారు: ఎంపీ రవిచంద్ర
ఈ పథకాన్ని ఆపించిన కాంగ్రెస్ రైతుల నోరు కొట్టింది,మనందరి అన్నం గిన్నెను గుంజుకుంది:ఎంపీ రవిచంద్ర
రైతుబంధు అందుకుంటున్న వారిలో కాంగ్రెస్ వాళ్లు కూడా ఉన్నారు కదా:ఎంపీ రవిచంద్ర
ఇది ఆగిపోతే రైతులందరితో పాటు కాంగ్రెస్ వాళ్లు కూడా నష్టపోతారు కదా: ఎంపీ రవిచంద్ర
రైతు వ్యతిరేక కాంగ్రెసుకు రైతన్నలు,అన్ని వర్గాల ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలి: ఎంపీ రవిచంద్ర
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని ఆపించింది ముమ్మాటికీ కాంగ్రెస్సేనని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు.గత పాలకులు దండుగ అనుకుని వదిలేసిన వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు,రైతుల ఆత్మహత్యలను నిలువరించేందుకు గాను రైతుబంధు పథకానికి కేసీఆర్ రూపకల్పన చేశారన్నారు.ఈ పథకం ద్వారా 10సీజన్లలో
65 లక్షల మంది రైతులకు రూ. 72 వేల కోట్ల మేర సాయమందిన విషయాన్ని ఎంపీ రవిచంద్ర ఒక ప్రకటనలో గుర్తుచేశారు.మహత్తరమైన ఈ పథకాన్ని ఐక్యరాజ్యసమితితో పాటు సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ప్రశంసించడాన్ని ఆయన ప్రస్తావించారు.ఈ పథకం ద్వారా లబ్దిపొందిన, పొందుతున్న వారిలో కాంగ్రెస్ వాళ్లు కూడా ఉన్నారు కదా అన్నారు.ఇది ఆగిపోతే యాసంగి పంటలతో పాటు కాంగ్రెస్ వాళ్లు కూడా నష్టపోవడం జరుగుతుందన్నారు.ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రైతన్నల నోరు కొట్టి,ప్రజల అన్నం గిన్నెను గుంజుకుందని ఎంపీ వద్దిరాజు ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు బీఆర్ఎస్, మహానేత కేసీఆర్ పట్ల రోజురోజుకు అభిమానం పెంచుకుంటున్నారన్న అక్కసుతో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేశారన్నారు.విజయవంతంగా అమలవుతున్న, కొనసాగుతున్న పథకాన్ని ఆపించిన రైతు వ్యతిరేక కాంగ్రెసుకు అమూల్యమైన తమ ఓటు ద్వారా గట్టి బుద్ది చెప్పాల్సిందిగా ఎంపీ రవిచంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.