Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

దేవుని ఎదుట భట్టి విక్రమార్క ఆరు గ్యారంటీల ప్రమాణం…

దేవుని ఎదుట భట్టి విక్రమార్క ఆరు గ్యారంటీల ప్రమాణం…
వాటిని కచ్చితంగా అమలు చేస్తామని హామీ
6 గ్యారంటీలపై కాంగ్రెస్ విస్తృత ప్రచారం
అఫడవిట్ పై సంతకం చూసి అఫిడవిట్ విడుదల చేసిన భట్టి

సీఎల్పీ నేత మధిర కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు వినూత్న ప్రచారం కల్పిస్తున్నారు …తన నియోజకవర్గంలో
ఎన్నికల్లో గెలిచిన తర్వాత 6 గ్యారంటీలు అమలు చేస్తామని బోనకల్ మండలం చొప్పకట్లపాలెం ఆంజనేయస్వామి దేవాలయంలో దేవుడి ఎదుట ప్రమాణం చేసిఅఫీడవిట్ పైన సంతకం చేశారు…తెలుగు ,ఇంగ్లీష్ లలో గ్యారంటీలను స్వయంగా దేవుని ఎదుట ఉంచి ప్రమాణం చేయడం చర్చనీయాంశం మారింది …సోమవారం బోనకల్లు మండలంలో పర్యటించిన భట్టికి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు …కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో భట్టి ఉన్నాడనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పర్యటనలు విశేష స్పందన కనిపిస్తుంది… తన ప్రసంగాలలో కూడా కేసీఆర్ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్నారు …కరెంటును పట్టుకున్న కాంగ్రెస్ తో పెట్టుకున్న మాడిమసై పోతావు కేసీఆర్ అంటూ ఆయన చేస్తున్న విమర్శ బాగా పాపులర్ అయింది …రాష్ట్ర సంపాదనను లూటీ చేసిన కేసీఆర్ ప్రజలపై భారాలు మోపుతూ ,మాయమాటలు చెపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు …

ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని దేవుడి ఎదుట ప్రమాణం చేసిన సీఎల్పీ నేత భట్టి

కార్తీక పౌర్ణమి రోజున బోనకల్ మండలం, చొప్పకట్లపాలెం ఆంజనేయస్వామి దేవాలయంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చిన అఫీడవిట్ పైన సంతకం చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

“ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాను. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పూర్తిగా అంకితం అవుతాను. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతాను. నిజాయితీగా
నా బాధ్యతలు నిర్వహిస్తాను. అవినీతికి ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తానని” సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కార్తీక పౌర్ణమి రోజున మధిర నియోజకవర్గం, బోనకల్ మండలం, చొప్పకట్లపాలెం గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామి ఆలయంలో ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన అంశాలను వంద రూపాయల బాండ్ పేపర్ పై ముద్రించిన అఫిడవిట్ పై దైవ సన్నిధిలో సంతకం చేశారు. మధిర నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పైన పేర్కొన్న విషయాలన్నింటికీ సదా కట్టుబడి ఉంటానని అఫిడవిట్ తో హామీ ఇచ్చారు.

బోనకల్ మండలం ముసికుంట్ల, లక్ష్మీపురం, గోవిందపురం ఎల్ గ్రామాల్లో భట్టి ఎన్నికల ప్రచారానికి జననీరాజనం పట్టారు …భట్టి ఎన్నికల ప్రచారంలో మాజీ పార్లమెంటు సభ్యులు సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు …వివిధ గ్రామాల్లో అడుగడుగునా స్వాగతాలు, భారీ ఊరేగింపులు, కోలాట మహిళల కోలాహలం ….మోగిన డప్పుల దరువులు.. పేలిన బాణాసంచా.. జై భట్టి అంటూ హోరేత్తిన నినాదాలు

ఈసందర్భంగా ఆయాగ్రామాల కూడళ్లలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ …కాంగ్రెస్ ను పట్టుకొని ,కరెంటును ముట్టుకొని చూడు మాడి మసైపోతావ్ కేసీఆర్….కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు రాదు కరెంటు ఉండదని పిచ్చి మాటలు మాట్లాడటం మానుకో కేసీఆర్…
కాంగ్రెస్ ఉంటేనే కరెంటు వచ్చింది….ఉచిత కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ది, ఆ పేటెంట్ కాంగ్రెస్ కు ఉంది…సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్టుగా ఉచిత కరెంటు తాను ఇస్తున్నానని కేసీఆర్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు …కేసీఆర్ అధికారంలోకి రాకముందే ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు ..ఏకకాలంలో లక్ష రుణమాఫీ చేయడంతో పాటు రైతులకు పావలా వడ్డీకే రుణాలు రాయితీలు పంట నష్టపరిహారం ఇచ్చాం…బిఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో రైతులకు ఒక్కసారైనా పంట నష్ట పరిహారం ఇచ్చిందా అని ప్రశ్నించారు ..చేయని వాటిని చేసినట్టుగా చెబుతున్న గాలి మాటలు, అడ్డగోలుగా మాట్లాడటం మానుకో కేసీఆర్ అన్నారు …తెలంగాణ ప్రజల బతుకులు మారాలని ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది…తెలంగాణ ప్రజల బతుకులు బాగు కాలేదు కానీ, పది సంవత్సరాలుగా పందికొక్కుల్లా ప్రజల సంపదను బిఆర్ఎస్ పాలకులు పంచుకుతిన్నారు…
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నట్టుగా … ఇంటికో ఉద్యోగం ఇస్తాన్నట్టుగా బిఆర్ఎస్ పాలకుల మాదిరిగా మోసం చేయడం కాంగ్రెస్ కు తెలియదు…రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి 15వేల రూపాయలు రైతు భరోసా ఇస్తాం…ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయల కట్నంతో పాటు తులం బంగారం ఇస్తాం…ప్రతి దళిత కుటుంబానికి అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా 12 లక్షల రూపాయలు ఇస్తాం…కాంగ్రెస్ కట్టిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు వల్లనే మధిరలో నీళ్లు పారుతున్నాయ్… ఐదు వేళ్ళతో అన్నం తింటున్నాం….
ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేయకున్నా, కాలువలు తీయకున్న మధిర భూములు బీడుగా మారి రేగి పండ్లు, బుడమ దోసకాయలు, మొక్కజొన్న కంకులు ఏరుకొని తినే పరిస్థితి ఉండేది…. మధిర నియోజకవర్గాన్ని మరోసారి అభివృద్ధి చేసుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి వస్తున్నది…రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తాను….మధిరకు నిధులు వరదల పారిస్తాను పరిశ్రమలు తెస్తాను ఇందిరమ్మ డైరీ పెడతాను 53 వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళ సభ్యులకు ఇందిరమ్మ డైరీలో వాటా కల్పించి వ్యాపారవేత్తలుగా తయారు చేస్తాను…వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తా…దేశంలోనే ఆధునిక నియోజకవర్గంగా మధిరను సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తాము…మధిర నియోజకవర్గ అభివృద్ధికి మీ ఓట్లు వేయండి…రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోండి….

మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ ….మధిర అభివృద్ధి ప్రదాత భట్టి విక్రమార్కను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు …కాంగ్రెస్ వి గ్యారెంటీ మాటలు కేసీఆర్ వి నీళ్ల మాటలని విమర్శించారు ..నోటికొచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడటానికి కేసీఆర్ ది నోరా? మున్సిపాలిటీ మోరీనా? కెసిఆర్ నాలుక తాటి మట్టన్నట్టుగా అడ్డగోలుగా అబద్ధాలే మాట్లాడుతుండు అంటూ మండిపడ్డారు ..

Related posts

జయలలిత దాచిపెట్టిన ఆస్తులని మంత్రి మల్లారెడ్డి దొంగిలించాడు: కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణ

Ram Narayana

పూర్తిగా మద్దతిస్తున్నాను…: మోదీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్

Ram Narayana

గెలిచిన మంత్రులు.. ఓడిన మంత్రులు వీరే!

Ram Narayana

Leave a Comment