Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అసెంబ్లీ ఎన్నికలుతెలంగాణ వార్తలు

నేటితో ఎన్నికల ప్రచారానికి తెర…గెలుపుపై ఎవరికీ వారే ధీమా …!

తెలంగాణ రాష్ట్రంలో నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది …గత నెల రోజులుగా హోరాహోరి ప్రచారం చేసిన రాజకీయపార్టీలు పోలింగ్ కు ముందు రోజు సాయంత్రం ఐదు గంటలవరకు ప్రచారానికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో అప్పటివరకు మైకుల ద్వారా జోరుగా ప్రచారం చేశారు ..5 గంటల ద్వారా మైకులు మూగపోయాయి… …అభ్యర్థులకు మద్దతుగా వచ్చిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ,ఆయా నియోజకవర్గాలను విడిచి వెళ్లి పోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి …ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రధాని మోడీ , హోమ్ మంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా , బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించగా , కాంగ్రెస్ తరుపున ఆపార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే , అగ్రనేతలు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ , బీఎస్పీ నేత మాయావతి , సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి , సిపిఐ ప్రధాన కార్యదర్శి డి .రాజా ,ఎన్నికల ప్రచారాలలో పాల్గొన్నారు…మంగళవారం తో ప్రచారానికి తెరపడనుండటంతో అభ్యర్థులు,రాజకీయపార్టీలు ఆయా నియోజకవర్గాల్లో ఆఖరి ఛాన్స్ గా బలప్రదర్శనాలు చేశారు …కార్లు , మోటార్ సైకిళ్ళు , తో చివర నిమిషం వరకు మైకులు హోరెత్తాయి…

బీజేపీ రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం అధికార బీఆర్ యస్ , కాంగ్రెస్ మధ్యనే నువ్వానేనా అన్నట్లుగా ఉంది…ఒక సందర్భంలో బీజేపీ గట్టి పోటీ ఇస్తోందని అనుకున్నప్పటికీ అది డీలాపడటంతో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది …మొదట కొన్ని జిల్లాల్లోనే కాంగ్రెస్ ప్రభావం ఉంటుందని భావించినప్పటికీ అన్ని జిల్లాల్లో ప్రభావం చూపడంతో ఎన్నికలు ఆసక్తిగా మారాయి…సీఎం కేసీఆర్ స్వయంగా 96 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు ..ప్రధాని మోడీ సైతం తెలంగాణ ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు …రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ , మల్లిఖార్జున ఖర్గే , యూపీ , ఛత్తీస్ ఘడ్ , కర్ణాటక ముఖ్యమంత్రులు సైతం ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు…
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి , సిపిఐ ప్రధాన కార్యదర్శి డి .రాజా , సిపిఎం నేతలు ,విజయరాఘవన్ , బృందకారత్ , మాణిక్ సర్కార్ , బివి రాఘవులు , సిపిఐ నేతలు నారాయణ ,అజీజ్ పాషా ,బీఎస్పీ నేత మాయావతి లాంటి యోధన యోధులు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని రక్తి కట్టించారు …ఎల్లుండి పోలింగ్ ఉండటంతో చివర ప్రయత్నాలు ప్రారంభించారు …

నోటుకు ఓటు ….

అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నోట్లకట్టలు పంపిణి చేస్తున్నారు ..ఇప్పటికి కొన్ని నియోజకవర్గాల్లో పంపిణి పూర్తీ అయింది …మరి కొన్ని నియోజకవర్గాల్లో ఈరోజు రేపు పంపిణీకి అభ్యర్థులు సిద్ధపడ్డారు .. ఖమ్మం జిల్లాలో నోటుకు ఓటు వ్యవహారం బెడిసి కొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు . కొందరు ఓటుకు 3 వేల రూపాయల వరకు పంపిన చేస్తుండగా , మరి కొందరు 2 వేల రూపాయలు ఓటుకు ఇస్తున్నారు …ఏజన్సీ ఏరియాలో ఓటుకు 500 ,1000 రూపాయలు పంపిణి జరుగుతున్నట్లు సమాచారం …

Related posts

సీఎం కేసీఆర్​ సంచలన నిర్ణయం.. ప్రొఫెసర్​ హరగోపాల్‌పై ఉపా కేసు ఎత్తివేత!

Drukpadam

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం.. సోనియా గాంధీ సందేశం…

Ram Narayana

ఢిల్లీలో గల్లీల్లో కేటీఆర్ ప్రదక్షిణలు అందుకే: రేవంత్‌రెడ్డి

Drukpadam

Leave a Comment