–సిపిఎంకు వేసే ప్రతి ఓటు ఒక పోరాట ఆయుధమే…సిపిఎం అభ్యర్థి శ్రీకాంత్
సిపిఎం అభ్యర్థి యర్రా శ్రీకాంత్ కు ఓటు వేయడం ద్వారా నిజాయతీకి పట్టం కట్టండి …సీపీఎం రాష్ట్ర నేత పోతినేని,నున్న పిలుపు…
ఖమ్మంలో నీతి నిజాయితీగా పరిపాలించిన ఘనత సీపీఎందే.
-నిజాయితీగల సీపీఎం యర్రా.శ్రీకాంత్ కి ప్రజలు స్వేచ్ఛoదంగా ఓటేయండి.
-నగరంలో సీపీఎం గెలుపును కాంక్షిస్తూ భారీ మోటర్ సైకిల్ ర్యాలీ.
ఖమ్మంలో నీతి నిజాయితీగా పరిపాలించిన ఘనత సీపీఎందేనని ,నిజాయితీగల సీపీఎంకి యర్రా శ్రీకాంత్ కి ప్రజలు స్వేచ్ఛoదంగా ఓటేయండనీ సీపీఎం రాష్ట్ర నేత పోతినేని.సుదర్శన్ రావు,జిల్లా కార్యదర్శి నున్న.నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.నాకు వేసే ప్రతి ఓటు ఒక పోరాట ఆయుధమే అవుతుందని సీపీఎం అభ్యర్ధి యర్రా.శ్రీకాంత్ తెలిపారు.
సీపీఎం అభ్యర్ధి యర్రా.శ్రీకాంత్ గారి విజయనీ కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో సీపీఎం అధ్వర్యంలో భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ర్యాలీ తొలుత యన్.యస్.పి క్యాంప్ సుందరయ్య భవన్ నుండి పాత బస్టాండ్ నుండి జడ్.పి సెంటర్ ఇల్లందు క్రాస్ రోడ్ మీదుగా గట్టయ సెంటర్ తిరిగి సుందరయ్య భవన్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోతినేని,నున్న ముఖ్య అతిదిలుగా పాల్గొని మాట్లాడుతూ ఖమ్మంలో రెండు కార్పొరేట్ శక్తులు ఎన్నికలలో డబ్బుతో గెలవాలని చూస్తున్నారని వారు ఆరోపించారు.ఖమ్మంలో నీతి నిజాయితీగా పరిపాలించిన ఘనత సీపీఎందే అన్ని,నిజాయితీగల సీపీఎంకి యర్రా శ్రీకాంత్ కి ప్రజలు స్వేచ్ఛoదంగా ఓటేయండనీ, మిగతా వారు ఎప్పుడైన కార్మికుల,ప్రజా సమస్యలపై పోరాడేరా అన్ని ప్రజలు ఆలోచించి నిత్యం ప్రజల కోసం కార్మికుల,ప్రజల కోసం పనిచేస్తున్న సీపీఎం పార్టీకి,యర్రా.శ్రీకాంత్ కి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు.సీపీఎం అభ్యర్ధి యర్రా.శ్రీకాంత్ మాట్లాడుతు నేను సామాన్యుడిని అన్ని గత 35 సంవత్సరాలుగా కార్మిక ఉద్యమంలో వారి సమస్యలపై పోరాడుతూ,ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను మీకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు.గత నలభై ఐదు సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీలో ఉంటూనే అనేక పోరాటాలు ప్రజల సమస్యల కోసం కృషి చేశానని, అనేక నిర్బంధాలు,కేసులను సైతం ఎదుర్కొని పనిచేస్తున్నానని ఆయన తెలిపారు.అందుకనే ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానని,నన్ను గెలిపిస్తే అసెంబ్లీ వేదికగా కార్మికుల,ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాడుతానని,కావున మీరందరూ నాకు ఓట్లు వేసి గెలిపించలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై. విక్రమ్, మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ అప్రోజ్ సమీనా,సీపీఎం కార్పొరేటర్లు యర్రా.గోపి,వేల్లంపల్లి.వెంకట్రావు,సీపీఎం జిల్లా నాయకులు యర్రా.శ్రీనివాసరావు, తుమ్మ.విష్ణు, నందిపాటి.మనోహర్,యమ్.ఏ జబ్బార్, డి.తిరుపతిరావు,యస్.నవీన్ రెడ్డి,బండారు.రమేష్, పి.రమ్య, యస్.కే మీరా,చింతల.రమేష్,తుడుం.ప్రవీణ్, బొడపట్ల.సుదర్శన్, జిల్లా.ఉపేందర్,వజినేపల్లి.శ్రీనివాసరావు,బండారు.యాకయ్య శీలం.వీరబాబు తదితరులు పాల్గొన్నారు.